Odisha: ఒడిశాలో మద్యం వ్యాపారుల ఇళ్లలో ఐటీ సోదాలు.! రూ.510 కోట్ల నగదు స్వాధీనం.
ఒడిశాలో ఆదాయపు పన్ను ఎగవేస్తున్న మద్యం వ్యాపారుల ఇళ్లపై గురువారం రెండో రోజూ సోదాలు కొనసాగాయి. ఇక్కడ మద్యం వ్యాపారుల ఇళ్లలో పెద్ద మొత్తంలో నగదు లభించినట్టు తెలుస్తోంది. సోదాలు నిర్వహిస్తున్న అధికారులు అక్కడి బీరువాల్లోని నగదు కట్టలను చూసి ఆశ్చర్యపోయారు. ఆ నగదును లెక్కపెట్టలేక కౌంటింగ్ మెషిన్లు సైతం అలసిపోయాయంటే అర్ధమవుతోంది.. ఏ రేంజ్‌లో మద్యం వ్యాపారులు ఆదాయపు పన్నుకు ఎగనామం పెడుతున్నారో..
ఒడిశాలో ఆదాయపు పన్ను ఎగవేస్తున్న మద్యం వ్యాపారుల ఇళ్లపై గురువారం రెండో రోజూ సోదాలు కొనసాగాయి. ఇక్కడ మద్యం వ్యాపారుల ఇళ్లలో పెద్ద మొత్తంలో నగదు లభించినట్టు తెలుస్తోంది. సోదాలు నిర్వహిస్తున్న అధికారులు అక్కడి బీరువాల్లోని నగదు కట్టలను చూసి ఆశ్చర్యపోయారు. ఆ నగదును లెక్కపెట్టలేక కౌంటింగ్ మెషిన్లు సైతం అలసిపోయాయంటే అర్ధమవుతోంది.. ఏ రేంజ్‌లో మద్యం వ్యాపారులు ఆదాయపు పన్నుకు ఎగనామం పెడుతున్నారో. ఒడిశాలోని రాయగడ గాంధీనగర్‌లో నివాసముంటున్న మద్యం వ్యాపారి అరవింద్ సాహు ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. అక్కడ పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇక్కడ లభించిన నగదు మొత్తం ఎంతన్నది వెల్లడించలేదు.
ఇటు భువనేశ్వర్, సుందర్‌గఢ్, బౌద్ధ్ జిల్లాలతోపాటు టిట్లాగఢ్‌లోనూ పలువురు మద్యం వ్యాపారుల నివాసాల్లో సోదాలు నిర్వహించారు. టిట్లాగఢ్ పట్టణంలో ఉంటున్న దీపక్ సాహు, సంజయ్ సాహు, రాకేశ్ సాహుల ఇళ్లలో రెండురోజుల తనిఖీల్లో ఏకంగా 510 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. బీరువాల నిండా పేర్చి ఉన్న నోట్లకట్టలు చూసి అధికారులు ఆశ్చర్యపోయారు. డబ్బును బుధవారం రాత్రి బొలంగీర్ ఎస్‌బీఐ శాఖకు తరలించారు. రాష్ట్రంలో 20 ప్రాంతాలతోపాటు ఝార్ఖండ్, కోల్‌కతాల్లోనూ ఐటీ సోదాలు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.