ఏడేళ్లుగా భర్త మిస్సింగ్.. గుట్టు బయటపెట్టిన రీల్స్ వీడియో

Updated on: Sep 02, 2025 | 9:27 PM

ఉత్తరప్రదేశ్ ఆజంగఢ్ జిల్లాలో వినూతన ఘటన జరిగింది. ఆటమావు గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఏడేళ్ల క్రితం మిస్ అయ్యాడు. అతనికి అప్పటికే వివాహం కాగా ఒక కొడుకు కూడా ఉన్నాడు. దీంతో అతని తల్లితండ్రులు అతని కోసం గలించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ ఫలితం లేకుండా పోయింది. చివరకు అతని పేరెంట్స్ అత్తమామలే కొడుకుని చంపారని ఆరోపించారు. దీనిపై ఇంకా కేసు నడుస్తున్నట్లు తెలుస్తుంది.

కనిపించకుండా పోయిన వ్యక్తిపై తల్లితండ్రులు ఆశలు వదిలేసుకున్నారు. కానీ భార్య మాత్రం పుట్టింటిలోనే ఉంటూ భర్త రాక కోసం ఎదురుచూస్తూ బతుకుతోంది. ఏనాటికైనా తన దగ్గరకు వస్తాడనే ఆశతో ఉంది. ఏడేళ్ల తర్వాత ఇటీవల సదరు భర్త లూథియానాలో మరో మహిళతో ఇన్ స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ దొరికిపోయాడు. ఈ రీల్ కాస్త భార్య చూడటంతో అసలు నిజం బయటకు వచ్చింది. కావాలనే అతడు పారిపోయాడని మరో మహిళతో జీవితం కోసం ఇంతకు తెగించాడని ఆమె నిర్ధారణ అయింది. తన భర్త బతికే ఉన్నట్లు అత్తమామలకు తెలుసని వారు ఈ రహస్యాన్ని దాచిపెట్టారని భార్య ఆరోపించింది. తన భర్త అత్తమామలు కలిసి నాటకం ఆడాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కాగా సోషల్ మీడియా వల్ల ఇలాంటి బెనిఫిట్ జరగడం ఆనందంగా ఉందంటున్నారు నెటిజన్లు. అతనే ప్రాణంగా జీవిస్తున్న భార్యను మోసం చేసిన భర్త గుట్టును ఒక రీల్ బయట పెట్టిందని కామెంట్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

కోళ్లగూడులో ఊహించని సీన్‌.. భయంతో పరుగులు తీసిన రైతు వీడియో

పాముకి చుక్కలు చూపించిన పిల్లి.. చివరికి వీడియో

విడాకులిచ్చిన భార్యకు షాక్.. భర్తకు జాక్‌పాట్‌.. ఏం జరిగిందట వీడియో

Published on: Sep 02, 2025 09:24 PM