రూ. 31 లక్షల కట్నం వద్దు.. ఒక్క రూపాయి చాలు అన్న వరుడు.. అవాక్కయిన అత్త మామలుడు

Updated on: Dec 03, 2025 | 6:11 PM

ముజఫర్‌నగర్‌లో అవధేష్ రాణా అనే వరుడు పెళ్లిలో రూ.31 లక్షల కట్నాన్ని తిరస్కరించి, కేవలం ఒక రూపాయి శుభశకునం మాత్రమే స్వీకరించాడు. మామ కష్టార్జితాన్ని తీసుకోలేనని చెప్పి, కట్నంపై సమాజానికి బలమైన సందేశం ఇచ్చాడు. అతని తల్లిదండ్రులు కూడా ఈ నిర్ణయాన్ని సమర్థించారు. ఈ ఆదర్శవంతమైన చర్య జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

కట్నం పూర్తిగా ఇవ్వలేదంటూ.. పీటల మీద పెళ్లిళ్లు ఆగిపోయిన ఘటనలు చూస్తుంటాం. పెళ్లి చేసుకున్న తర్వాత భర్త, అత్తమామలు కలిసి యువతిని హింసించడం వంటి వార్తలూ విన్నాం. కానీ ఒక వ్యక్తి మాత్రం.. తనకు కట్నమే వద్దంటూ పీటలపైనే తెగేసి చెప్పేసి.. అందరికీ ఆదర్శంగా నిలిచాడు. తన మామ కష్టార్జితాన్ని తీసుకోలేనని చెప్పేశాడు. పెళ్లిలో రూ.31 లక్షల కట్నం వద్దని.. ఒక్క రూపాయి మాత్రమే తీసుకున్నాడు. ఉత్తర్‌ప్రదేశ్‌ ముజఫర్‌నగర్‌లో వరుడు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అందరి హృదయాలను హత్తుకుంది. కట్నంగా ఇచ్చిన భారీ మొత్తాన్ని సున్నితంగా తిరస్కరించి.. కేవలం రూ.1 శుభశకునం మాత్రమే స్వీకరించి.. ఆ యువకుడు సమాజానికి బలమైన సందేశం ఇచ్చాడు. వరుడు అవధేష్ రాణా.. కట్నంగా పెళ్లి కుమార్తె కుటుంబం ఇచ్చిన రూ.31 లక్షల మొత్తాన్ని తిరస్కరించాడు. అదితి సింగ్‌తో అతని పెళ్లి నవంబర్ 22న జరిగింది. పెళ్లిలో తిలకం కార్యక్రమంలో వధువు కుటుంబం రూ.31 లక్షల కట్నం అలంకరించిన పళ్లెంలో ఉంచి ఇవ్వగా.. దానికి అవధేష్ వద్దని చెప్పాడు. ఇది వధువు తండ్రి కష్టార్జితమని.. దాన్ని తీసుకునే హక్కు తనకు లేదని.. తాను దీన్ని అంగీకరించలేనని చెబుతూ డబ్బును తిరిగి ఇచ్చేశాడు. కొవిడ్ మహమ్మారి సమయంలో తండ్రి సునీల్ సింగ్‌ను కోల్పోయిన వధువు అదితి సింగ్.. ఆమె తల్లి, తాత కలిసి ఈ రూ.31 లక్షల డబ్బును ఏర్పాటు చేసారు. వరుడు తీసుకున్న ఈ నిర్ణయాన్ని అతడి తల్లిదండ్రులు కూడా సమర్థించారు. ఈ ఘటన ను చూసి పెళ్లికి వచ్చిన అతిథులు ఆశ్చర్యపోయారు . అవధేష్ చేసిన పనిపై జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కార్పొరేట్ జాబ్ వదిలాడు.. ఆటో డ్రైవర్‌గా మారాడు..

ఉచిత బస్సులో కూర్చొన్నాడని.. ఉతికి పారేశారు.. బాబోయ్ అలా కొట్టారు ఏంటి

ఐటీ రిఫండ్‌ ఇంకా రాలేదా ?? అయితే కారణం ఇదే

అయ్యో.. బురదలో ఇరుకున్న ఏనుగు.. కట్ చేస్తే..

ర్యాపిడో బైక్‌ రైడర్‌ ఖాతాలో రూ.331 కోట్లు.. ఈడీ దర్యాప్తు