వారి ప్లాన్ వర్కౌట్ అయింది. కోతుల బెడద నుంచి కాస్త రిలాక్స్ అయ్యారు. వర్ధన్నపేటలోని వెంకటేశ్వర నర్సింగ్ హోంకు కొండముచ్చు పహారా కాస్తుంది. ఆసుపత్రికి వచ్చే వారిపై కోతులు పలమార్లు దాడులకు దిగి రోగులకు తెచ్చే తినే బండారాలను ఎత్తుకెళ్లిపోవడం గమనించిన ఆసుపత్రి నిర్వాహకుడు డాక్టర్ రాజ నరేంద్ర రెడ్డి 30,000 రూపాయలు వెచ్చించి ఏపీ నుంచి ఓ కొండముచ్చును ఆసుపత్రికి కాపలా కోసం తెచ్చారు. దీంతో ఆసుపత్రి చుట్టుపక్కల కోతుల సంచారం లేకుండా పోయింది. కొండముచ్చు రాకతో ఆ ప్రాంతం కోతుల బెడద నుంచి ఉపశమనం లభించినట్లయింది. అయితే ఆసుపత్రి నిర్వాహకులు చేసిన వినూత్న ఆలోచనను రోగులు వారి బంధువులు ఆశ్చర్యం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.