పైలట్ కళ్లలోకి లేజర్ లైట్.. గాల్లో 171 మంది ప్రాణాలు !!
బెంగళూరు నుంచి కోల్‌కతా వచ్చిన విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. కోల్‌కతాకు చేరుకుని ల్యాండింగ్‌కు సిద్ధమైన సమయంలో అప్రోచ్ ఫన్నెల్ నుంచి విమానం కాక్‌పిట్‌లోకి గుర్తుతెలియని వ్యక్తులు లేజర్ లైట్ వేశారు. ఈ కిరణాలు పైలట్ కళ్లలో పడ్డాయి. ఈ నెల 23న రాత్రి 7.30 గంటలకు జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాసేపట్లో ల్యాండ్ అయ్యేందుకు అవసరమైన ఆపరేషన్ చేస్తున్న సమయంలో పైలట్ కళ్లలో లేజర్ లైట్ పడటంతో అతడి కళ్లు కాసేపు కనిపించలేదు.
బెంగళూరు నుంచి కోల్‌కతా వచ్చిన విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. కోల్‌కతాకు చేరుకుని ల్యాండింగ్‌కు సిద్ధమైన సమయంలో అప్రోచ్ ఫన్నెల్ నుంచి విమానం కాక్‌పిట్‌లోకి గుర్తుతెలియని వ్యక్తులు లేజర్ లైట్ వేశారు. ఈ కిరణాలు పైలట్ కళ్లలో పడ్డాయి. ఈ నెల 23న రాత్రి 7.30 గంటలకు జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాసేపట్లో ల్యాండ్ అయ్యేందుకు అవసరమైన ఆపరేషన్ చేస్తున్న సమయంలో పైలట్ కళ్లలో లేజర్ లైట్ పడటంతో అతడి కళ్లు కాసేపు కనిపించలేదు. దీంతో విమానం రన్ వే వైపు నిమిషానికి 1500 నుంచి 2000 అడుగుల వేగంతో కిందకు దూసుకువచ్చింది. ఈ సమయంలో విమానంలో 165 మంది ప్యాసింజర్లతో పాటు ఆరుగురు సిబ్బంది ఉన్నారు. చివరకు విమానం సేఫ్‌గా ల్యాండ్ అవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Jayalalithaa AI: హలో.. నేను మీ జయలలితను మాట్లాడుతున్నా
తాటిచెట్టుకు పెద్దపులి కాపలా !! కల్లుగీత కార్మికుడి ఐడియా అదిరిందిగా