విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి

Updated on: Jan 02, 2026 | 5:03 PM

ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్యాసింజర్ విండోపై "మాన్విక్" అనే పేరు చెక్కడాన్ని మరో ప్రయాణికుడు గుర్తించి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ సంఘటన వైరల్ అయ్యింది. పబ్లిక్ ప్రాపర్టీపై విధ్వంసంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విమానంలో పదునైన వస్తువు ఎలా వచ్చిందని ప్రశ్నిస్తూ, ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు.

కొందరు ఎక్కడపడితే అక్కడ తమ పేర్లు రాయడం లేదంటే ఏవో బొమ్మలు వేయడం లాంటివి చేస్తుంటారు. పార్కుల్లో చెట్లపైన, పబ్లిక్‌ టాయిలెట్స్‌లో, కళాశాలల గోడలపైన కూడా అలాంటివి చూస్తుంటాం. అయితే ఓ వ్యక్తి ఏకంగా విమానంలో ప్రయాణిస్తూ అతను చేసిన పనికి నెటిజన్లు మండిపడతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్యాసింజర్ తాను కూర్చున్న సీటు పక్కన విండోపై ఓ పేరు చెక్కి ఉండటం గుర్తించాడు. దానిని ఫొటో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ… ‘ఈ ఇడియట్ చేసిన పని చూడండి’ అంటూ కాప్షన్ జోడించాడు. పబ్లిక్ టాయిలెట్లు, పర్యాటక ప్రాంతాల్లోని కట్టడాల నుంచి కొందరి మూర్ఖత్వం విమానం కిటికీ వరకూ చేరిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ విమానం కిటికీ పైన చెక్కిన ‘మాన్విక్ లేదా మాన్వి కె’ అనే పేరు ఈ ఫొటోలో స్పష్టంగా కనిపిస్తోంది. కాగా, ఈ పోస్టుపై నెటిజన్లు స్పందిస్తూ.. క్యాబిన్ సిబ్బందికి ఫిర్యాదు చేయాలని సూచించారు. కిటికీ అద్దంపై పేరు చెక్కాడంటే ఏదో ఒక పదునైన వస్తువును ఉపయోగించి ఉంటాడని, కానీ, విమానంలోకి పదునైన వస్తువులను అనుమతించరు కదా ఇది ఎలా జరిగిందటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఓ నెటిజన్ మాత్రం ఇలాంటి వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని కామెంట్ లో కోరాడు. అయితే, కిటికీ అద్దంపై మరో ప్లాస్టిక్ షీట్ ఉంటుందని, సిబ్బంది తరచూ ఆ షీట్ ను మారుస్తుంటారు కాబట్టి ఆందోళన అక్కర్లేదని మరో నెటిజన్ చెప్పారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కలవరపెడుతున్న స్క్రబ్‌ టైఫస్‌..22 మంది మృతి

తేనెటీగకు లీగల్‌ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత

10 రోజులు షుగర్ తినడం మానేస్తే మన శరీరంలో జరిగేది తెలిస్తే

జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది

ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం