భారత్‌లో కొత్త ట్రెండ్..పెళ్లికి “నో” చెబుతున్న యంగ్ ఇండియా.!
భారత్‌లో కొత్త ట్రెండ్‌గా యువత పెళ్లికి నో చెబుతోంది. కెరీర్‌కు, వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యతనిస్తూ, సాంప్రదాయ వివాహ బంధం పట్ల వారి ఆలోచనలు మారుతున్నాయి. ఆర్థిక స్వాతంత్ర్యం, వ్యక్తిగత నిర్ణయాలు, జీవనశైలి మార్పులు ఈ ధోరణికి కారణమవుతున్నాయి. సర్వే డేటా షాకింగ్ నిజాలను వెల్లడిస్తోంది.
భారతదేశంలో పెళ్లి అనేది రెండు కుటుంబాల కలయికగా, బంధాలకు మారుపేరుగా నిలిచింది. అమ్మానాన్నలు చూసిన సంబంధం, పెద్దల ఆశీర్వాదంతో జరిగే ఈ వేడుక ఒకప్పుడు మధురమైన జ్ఞాపకం. అయితే గత కొన్నేళ్లుగా మన సమాజంలో ఒక నిశ్శబ్ద విప్లవం నడుస్తోంది. పెళ్లి పీటల మీద కూర్చోవడానికి ఒకప్పుడు క్యూ కట్టిన యువత ఇప్పుడు పెళ్లి మాకొద్దు అంటోంది. ఈ మార్పుకు ప్రధాన కారణం నేటి యువత కెరీర్‌కు, వ్యక్తిగత స్వేచ్ఛకు ఇస్తున్న ప్రాధాన్యత. ముందు మన కాళ్ల మీద మనం నిలబడాలి, ఆ తర్వాతే మరో జీవితం అనే భావన బలంగా పెరిగింది. ప్రభుత్వ డేటా ప్రకారం, 2005లో 15 ఏళ్ల వయసులోనే పెళ్లిళ్లు చేసుకున్న వారి శాతం 12గా ఉండగా, ఇప్పుడు అది 1.7 శాతానికి పడిపోయింది. అయితే 25 నుంచి 29 ఏళ్ల వయసున్న మహిళల్లో పెళ్లి చేసుకోని వారి సంఖ్య 6 శాతం నుండి 10 శాతానికి, పురుషుల్లో అయితే 30 శాతం నుండి 42 శాతానికి పెరిగింది. అంటే పెళ్లిని ఆలస్యం చేయడం అనేది ఒక పద్ధతిగా మారిపోయింది. ఆర్థిక స్వేచ్ఛ ఇప్పుడు కేవలం సౌకర్యం కాదు, అది ఒక అవసరంగా మారింది. పెళ్లి అనేది ఇప్పుడు జీవితంలో మొదటి మెట్టు కాదు, అది ఎంచుకోదగ్గ ఒక ఆప్షన్ మాత్రమే అని యువత భావిస్తోంది.
మరిన్ని వీడియోల కోసం :