బాబోయ్ ఇదెక్కడి పెయింటింగ్ రా బాబు.. షాకింగ్ వీడియో

|

Oct 04, 2022 | 9:29 AM

ప్రపంచంలో కళాకారులకు కొరత లేదు. జిహ్వకో రుచి అన్నట్లుగా.. ఒక్కొక్కరూ ఒక్కో రకమైన కళలో ఆరితేరి ఉంటారు. అలాంటి వారి కళలు యావత్ ప్రపంచాన్నే అబ్బురపరుస్తాయి.

ప్రపంచంలో కళాకారులకు కొరత లేదు. జిహ్వకో రుచి అన్నట్లుగా.. ఒక్కొక్కరూ ఒక్కో రకమైన కళలో ఆరితేరి ఉంటారు. అలాంటి వారి కళలు యావత్ ప్రపంచాన్నే అబ్బురపరుస్తాయి. ఎక్కువ శాతం పెయింటింగ్స్ పట్ల ప్రజలు మక్కువ చూపుతారు. పెయింటర్స్ కూడా తమలోని సృజనాత్మకతను మొత్తం వెలికితీసి మరీ పెయింటింగ్స్ వేస్తుంటారు. కొందరు పేపర్ పెయింట్స్ వేస్తే.. ఇంకొందరు వస్తువులపై వేస్తారు.. మరికొందరయితే వ్యక్తులపై అద్భుతంగా పెయింటింగ్స్ వేస్తారు. తాజాగా అలాంటి పెయింటింగ్ ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఆ పెయింటింగ్ చూసిన నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. వామ్మో ఇదేం పెయింటింగ్ అంటూ హడలిపోతున్నారు. అదే సమయంలో పెయింటర్ సృజనాత్మకతకు సలామ్ కొడుతున్నారు. మనకు ఇక్కడ కనిపించే ఈ పెయింటర్ మాత్రం నెక్ట్స్‌లెవల్‌లో వేశారు. అమ్మాయిల ముఖాలకు 3డీ పెయింటింగ్ వేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో 7 రకాల ‘ఫేస్ పెయింటింగ్స్’ ఉన్నాయి. వీటిని చూసి నెటిజన్లు అయోమయానికి గురవుతున్నారు. అందులోని కొన్ని పెయింటింగ్స్ అయితే, భయపెట్టేలా ఉన్నాయి. పెయింటింగ్‌లో ఒక అమ్మాయి ముఖాన్ని రెండు ముఖాలుగా, నాలుగు కళ్లు ఉన్నట్లు ప్రతిబింబించేలా చిత్రీకరించారు. మరో పెయింటింగ్‌లో అమ్మాయి ముఖాన్ని బార్బీ బొమ్మలా చక్కగా వేశారు. ఇందులో నిజమైన ఫేస్ ఏంటో, పెయింటింగ్ ఏదో గుర్తించలేనంతగా ఉంటుంది. ఇక మూడో పెయింటింగ్‌లో అమ్మాయి ముఖం జోంబిలా కనిపిస్తుంది. ఇలా మిగతా పెయింటింగ్స్ కూడా చాలా ఆశ్చర్యకరంగా, షాకింగ్‌గా ఉన్నాయి. వీటిని చూసి జనాలు ఫుల్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈ షాకింగ్ వీడియోను చూసిన నెటిజన్ల నుంచి రకరకాల కామెంట్స్ వస్తున్నాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పదేండ్లుగా ఎత్తిన చెయ్యి దించనేలేదు !! ఏపనైనా ఒంటి చేత్తోనే

కారు తెచ్చిన అదృష్టం.. ఏకంగా రూ.80 లక్షలు

కంటి చూపుతో పామును కంట్రోల్ చేస్తున్న యువకుడు.. యువకుడి కళ్లలోకి చూస్తూ కింగ్‌ కోబ్రా డాన్స్‌

ఈ పెద్దాయన డబ్బుని ఎలా లెక్కిస్తున్నాడో చూశారా.. ఎమోషనల్‌ వీడియో

దొంగలుగా పొరపాటు పడి.. పరుగో పరుగు !! వైరల్‌ వీడియో

 

Follow us on