ఈ కాయ ఇంట్లో ఉంటే చాలు.. సంపద పెరిగి ధనవంతులవుతారట..

|

Mar 14, 2024 | 12:38 PM

తమిళనాడు ఈరోడ్‌ జిల్లా అన్నామలైపాలైయం గ్రామంలోని కరుప్పనై ఈశ్వరన్‌ కోవెలలో శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడోరోజు నిమ్మకాయను వేలం వేశారు. స్వామివారి సన్నిధిలో ఉంచిన నిమ్మకాయ కావడంతో వేలం పాటలో నిమ్మకాయను దక్కించుకోవడానికి భక్తులు పోటీ పడ్డారు. ప్రతి ఏటా శివరాత్రి మూడవ రోజున ఈ ఆలయంలో వేలం పాట నిర్వహిస్తారు. స్వామి దగ్గర పూజలు అందుకున్న నిమ్మకాయను ఇంట్లో ఉంచుకుంటే సంపద వస్తుందని భక్తుల నమ్మకం.

తమిళనాడు ఈరోడ్‌ జిల్లా అన్నామలైపాలైయం గ్రామంలోని కరుప్పనై ఈశ్వరన్‌ కోవెలలో శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడోరోజు నిమ్మకాయను వేలం వేశారు. స్వామివారి సన్నిధిలో ఉంచిన నిమ్మకాయ కావడంతో వేలం పాటలో నిమ్మకాయను దక్కించుకోవడానికి భక్తులు పోటీ పడ్డారు. ప్రతి ఏటా శివరాత్రి మూడవ రోజున ఈ ఆలయంలో వేలం పాట నిర్వహిస్తారు. స్వామి దగ్గర పూజలు అందుకున్న నిమ్మకాయను ఇంట్లో ఉంచుకుంటే సంపద వస్తుందని భక్తుల నమ్మకం. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు కావేరి నది జలాలతో స్వామికి అభిషేకం నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేసి రాత్రి సమయంలో నిర్వాహకులు నిమ్మకాయను వేలం వేసారు. నిమ్మకాయను సొంతం చేసుకోవడానికి భక్తులు పోటీ పడ్డారు . చివరికి వేలంలో నిమ్మకాయను 20 వేల రూపాయలకు దక్కించుకున్నాడు ఓ భక్తుడు. వేలంలో వెండి నాణెం 15 వేల రూపాయలకి, వెండి ఉంగరం 14 వేలు పలికిందని నిర్వాహకులు తెలిపారు. ఈ ఉత్సవాలకు నాలుగు జిల్లాల నుంచి వేల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Cotton Candy: రంగేసిన పీచు మిఠాయిపై నిషేధం

Vijay: హీరో విజయ్ పార్టీ సభ్యత్వంలో అప్పుడే లుకలుకలు !!

Vande Bharat: విశాఖకు కొత్తగా 2 వందే భారత్‌ రైళ్లు..

1200 ఏళ్లనాటి సమాధిలో బంగారం నిధి..

Poonam Kaur: గీతాంజలి మరణంపై నటి పూనమ్ కౌర్ సంచలన ట్వీట్‌..