ఈ సారి బైక్ మీద కాదు.. ఆటోలోనే రచ్చ రచ్చ చేసిన జంట..
సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం యువత విచక్షణ కోల్పోయి బహిరంగంగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ పాతబస్తీలో ఓ ఆటోలో జంట ఒకరినొకరు ముద్దులు పెట్టుకుంటూ ప్రయాణించడం వైరల్‌గా మారింది. ఈ ఘటన పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలని రీల్స్, వీడియోలు కోసం యువత విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారు. నడిరోడ్డుపై యువతియువకులు అభ్యంతరకరంగా ప్రవర్తిస్తూ ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. బైక్‌పై వెళ్తూ యువతీ యువకులు అభ్యంతరకరంగా ప్రవర్తించిన అనేక వీడియోలు నెట్టింట చూశాం. తాజాగా ఓ జంట ఆటోలో వెళ్తూ ఒకరినొకరు ముద్దులు పెట్టుకుంటూ వెళ్లడం గమనించిన ఇతర వాహనదారులు ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఇలా బరితెగించి ప్రవర్తించేవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ పాతబస్తీ లో ఈ ఘటన జరిగింది. నల్గొండ క్రాస్ రోడ్స్ నుండి కోఠి రూట్‌లో ఛాదర్‌ఘాట్ వైపు ఓ ఆటోలో ముగ్గురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. వారిలో ఓ యువతి ఆటోడ్రైవర్ ఒడిలో కూర్చుని అతన్ని హగ్ చేసుకుంటూ, ముద్దులు పెడుతూ అభ్యంతరకరంగా ప్రవర్తించింది. ఆటోలో వెనుక సీటులో కూర్చున్న మరో వ్యక్తి వీరి ప్రవర్తనను వీడియో తీస్తూ కనిపించాడు. రోడ్డుపై వెళ్తున్న ఇతర వాహనదారులు ఈ ఘటన చూసి షాకయ్యారు. యువతి, యువకుడి ప్రవర్తనపై మండిపడుతున్నారు. ఆటోనంబరు ఆధారంగా వారిపై కేసు నమోదు చేయాలని, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పాలు తెస్తానని వెళ్లి.. డ్యామ్‌లో
రచ్చ రచ్చగా మిస్ యూనివర్స్ భామల వాకౌట్‌తో షాక్
