దారుణం.. 2 నెలల పసికందును పొయ్యిలో పడేసి..
హైదరాబాద్ జీడిమెట్లలో దారుణం చోటుచేసుకుంది. రెండు నెలల పసికందు ఏడుస్తున్నాడని కసాయి తల్లి కట్టెల పొయ్యిలో వేసి సజీవదహనం చేసింది. బౌరంపేటలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. మానవత్వం మరిచి, మమతను చంపుకున్న ఆ తల్లిపై కేసు నమోదు చేశారు.
అమ్మ అంటే కనిపించే దైవం అని చెబుతారు. అలాంటి అమ్మతనానికే మచ్చ తెస్తూ.. కొందరు మానవత్వం..కన్నతత్వం మరిచి ప్రవర్తిస్తుంటారు. సరిగ్గా అలాంటి ఘటనే జరిగింది హైదరాబాద్ జీడిమెట్లలోని బౌరంపేటలో. ఏడుస్తున్నాడన్న చిన్న కారణంతో, కన్నబిడ్డ అని కూడా చూడకుండా రెండు నెలల పసికందును కట్టెల పొయ్యిలో వేసి సజీవదహనం చేసింది ఓ కసాయి తల్లి. మధ్యప్రదేశ్‌కు చెందిన మమత, రాజేందర్ దంపతులు బౌరంపేట్ ఓఆర్ఆర్ సమీపంలోని ఒక అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నారు. వీరికి రెండు నెలల బాబు ఉన్నాడు. అయితే ఆ పసికందు అదేపనిగా ఏడుస్తున్నాడని ఆగ్రహించిన తల్లి మమత, మృగంలా ప్రవర్తించింది. ఆ బిడ్డ కళ్లకు గంతలు కట్టి, నోట్లో గుడ్డలు కుక్కి, ఎవరూ లేని సమయం చూసి మండుతున్న కట్టెల పొయ్యిలో పడేసింది. కనీసం ‘అమ్మా’ అని అరుపు కూడా వినపడకుండా నోట్లో గుడ్డలు కుక్కిన ఆ రాక్షసత్వం చూసి పోలీసులు సైతం విస్తుపోయారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో డయల్ 100 ద్వారా సమాచారం రావడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే ఆ పసి ప్రాణం నిప్పుల్లో కాలి బూడిదైంది. అత్యంత దారుణంగా ఉన్న ఆ మృతదేహాన్ని చూసి స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. పేరులో ఉన్న ‘మమత’ను గుండెలో చూపించలేకపోయిన ఆ తల్లిని పిచ్చితనమనాలా లేక సైకో అనాలా అని జనం ప్రశ్నిస్తున్నారు. బిడ్డ ఏడుస్తుంటే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాల్సింది పోయి, ఇంతటి కిరాతకానికి ఒడిగట్టడం దారుణం అంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆ తల్లిని అదుపులోకి తీసుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vijay-Rashmika Marriage: కొడవ సంప్రదాయంలో.. పెళ్లి చీర ఎలా కట్టుకుంటారంటే
Vijay-Rashmika Marriage: కొడవ సంప్రదాయంలో.. వరుడు ఎలాంటి దుస్తులను ధరించాలంటే
Vijay-Rashmika Marriage: ‘విరోషి’ పెళ్లిలో.. ఘుమ ఘుమలాడే వంటకాలు
Anvesh: ‘నా అన్వేష్‌కు లుక్ అవుట్ నోటీసులు’ నోరు అదుపులో లేకపోతే ఇంతే
Vijay-Rashmika Marriage: పైసా వసూల్ పెళ్లి ?? భారీ ధరకు విరోషి పెళ్లి రైట్స్
