ఇలాంటి సీన్ లేకుండా 31 దావత్ ఉంటుందా.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ వనస్థలిపురంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన ఓ యువకుడు పోలీసులకు షాక్ ఇచ్చాడు. రోడ్డుపై పడుకుని హల్‌చల్ చేస్తూ, పోలీసులు తనను కొట్టారని ఆరోపించాడు. తాను బైక్ నడపడం లేదని, స్నేహితుడి వెనుక కూర్చున్నానని వాదించాడు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్‌లోని వనస్థలిపురం వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుండగా ఊహించని సంఘటన చోటుచేసుకుంది. మద్యం సేవించి వాహనం నడుపుతున్నాడని అనుమానించి అడ్డుకున్న ఒక యువకుడు పోలీసులకే జలక్ ఇచ్చాడు. తనని కానిస్టేబుల్ కొట్టాడంటూ రోడ్డుపై అడ్డంగా పడుకుని హడావుడి సృష్టించాడు. తాను బైక్ నడపడం లేదని, తన స్నేహితుడి బైక్ వెనుక కూర్చున్నానని, అయినప్పటికీ తనపై చేయి చేసుకున్నారని ఆరోపించాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కొండలా పేరుకుపోయిన అప్పు రూ.1.75 కోట్లకు రూ.147 కోట్లు
ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా తెగి పడిన చెవి.. ఆ తర్వాత
బతికున్న వ్యక్తిని చనిపోయాడంటూ పోస్టుమార్టంకు..
