Telangana: ‘ఈ బస్సు నడపడం నా వల్ల కాదు..’ నడిరోడ్డుపై ఆపేసిన డ్రైవర్

| Edited By: Ram Naramaneni

Aug 23, 2024 | 12:09 PM

నడిరోడ్డుపై బస్సును ఆపేశాడు డ్రైవర్. ఇలా బస్సును నడపలేనంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రయాణికులు సహకరిస్తేనే బస్సు ముందుకు కదులుతుందని తెగేసి చెప్పాడు. చివరికి....

కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో ఆర్టీసీ బస్‌ను నడి రోడ్డుపై నిలిపివేశాడు డ్రైవర్.  సిరిసిల్ల నుంచి వరంగల్‌కి వెళ్తున్న ఆర్టీసీ బస్ హుజురాబాద్ బస్టాండ్‌లో ప్రయాణీకులను ఎక్కించుకుని స్టార్ట్ అయ్యింది. బస్‌లో 55 మంది కెపాసిటీకి గాను 110 మంది ఎక్కారు. ఓవర్ లోడ్ అయిందని.. ఎంత చెప్పినా ప్రయాణికులు బస్సు దిగకపోవడంతో చేసేదేమిలేక అలానే బయటకు పోనిచ్చాడు డ్రైవర్. బస్సు రన్నింగ్‌లో, సైడ్ వ్యూ మిర్రర్ కనబడట్లేదు. దీంతో ప్రమాదం జరిగే అవకాశం ఉందని కొంతమంది ప్రయాణీకులు దిగాలని డ్రైవర్ కోరారు. అతని మాటల్ని ఎవరూ పట్టించుకోలేదు. ఎంత రిక్వెస్ట్ చేసినా వినకపోడంతో డ్రైవర్ వరంగల్ రోడ్‌పై బస్సును నిలిపివేశాడు. కాసేపటి తర్వాత ఎట్టకేలకు ప్రయాణికులు సహకరించడంతో బస్సు ముందుకు కదిలింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..