ఫ్రిజ్‌ ఓపెన్‌ చేయడానికి వెళ్లిన మహిళ.. అక్కడ సీన్‌ చూసి గుండె గుభేల్‌

Updated on: Aug 18, 2026 | 6:50 PM

వర్షాకాలంలో ఆవాసాలు కోల్పోయిన పాములు జనావాసాల్లోకి వస్తున్నాయి. తాజాగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్‌లోని ఓ ఇంటి కిచెన్‌లో భారీ నాగుపాము కలకలం రేపింది. ఫ్రిడ్జ్ వెనుక పడగ విప్పి భుసలు కొడుతున్న పామును చూసి మహిళ భయంతో బయటకు పరుగులు తీసింది. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ కిరణ్ కుమార్ అక్కడికి చేరుకుని పామును సురక్షితంగా పట్టుకున్నారు. అనంతరం అటవీ ప్రాంతంలో విడిచిపెట్టేందుకు చర్యలు చేపట్టారు.

వర్షాకాలం కావడంతో పాములు తమ ఆవాసాలు కోల్పోయి ఆహారం కోసం వెతుక్కునే క్రమంలో జనావాసాల్లో సంచరిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇళ్లలో ఎక్కడపడితే అక్కడ తిష్టవేస్తూ పరుగులు పెట్టిస్తున్నాయి. తాజాగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్‌లో ఓ ఇంట్లో ఊహించని ఘటన జరిగింది. రోజువారీ పనుల్లో భాగంగా ఇంట్లోని మహిళ కిచెన్ రూమ్‌లోకి వెళ్లగా, అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆమె గుండె ఆగిపోయినంత పనైంది. ఫ్రిడ్జ్ వెనుక వైపు తిష్ట వేసిన ఒక భారీ నాగుపాము పడగ విప్పి భుసలు కొడుతూ కనిపించింది. పామును చూసిన ఆమె ప్రాణభయంతో పరుగులు తీసి బయటకు వచ్చి కిచెన్ డోర్ లాక్ చేశారు. కుటుంబ సభ్యులకు విషయం చెప్పడంతో అందరూ భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమై స్థానిక స్నేక్ క్యాచర్ కిరణ్ కుమార్‌కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న కిరణ్ కుమార్ తక్షణం ఘటనాస్థలికి చేరుకొని కిచెన్‌లోకి ప్రవేశించారు. ఫ్రిడ్జ్ వెనుక నక్కి ఉన్న ఆ భారీ నాగుపామును ఎంతో జాగ్రత్తగా పట్టుకుని సురక్షితంగా బంధించారు. పామును రెస్క్యూ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ఆ పామును సురక్షితంగా అటవీప్రాంతంలో విడిచిపెడతానని స్నేక్‌ క్యాచర్‌ తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కన్న కొడుకునే కిల్లర్‌గా మార్చిన తల్లి.. ఎందుకో తెలిస్తే వెన్నులో వణుకే!

దూసుకొచ్చిన మృత్యువు.. తల్లిదండ్రుల ముందే విగతజీవిగా మారిన యువతి

బర్త్‌డే కేక్‌లో చచ్చిన బల్లి.. 11 మంది ఆసుపత్రిపాలు!

రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఒకేసారి 5 అదిరిపోయే పథకాలు!

అది ఇల్లా.. బంగారు గనా..! రెనోవేషన్‌ చేస్తుండగా కుప్పలు తెప్పలుగా పడిన బంగారం

Loading...
Unable to load recommendations.
Follow Us