ఆ పనిమనిషి చేసిన పనికి సోషల్ మీడియా షేక్
భార్యభర్తలిద్దరూ ఉద్యోగస్తులైతే ఇంట్లో పనులు చేసుకునే అవకాశం చాలా తక్కువగా ఉండటంతో కొందరు.. వయోభారంతో ఇంటి పనులు చేసుకోలేక కొందరు సహాయకులను పెట్టుకుంటారు. అయితే ఈ సహాయకులకీ సొంత పనులుంటాయి.. వారికీ సెలవు అవసరం పడుతుంది. అలాంటప్పుడు వారు రాకపోతే వారిపైనే డిపెండ్ అయిన యజమానులు ఇబ్బందులు పడుతుంటారు.
అదీకాకుండా ఈ పనివారు చెప్పాపెట్టకుండా మానేస్తుంటారు. ఇది యజమానులను మరింత ఇబ్బందులకు అసహనానికి గురిచేస్తుంది. కానీ ఓ పనిమనిషి చాలా బాధ్యతాయుతంగా ఆలోచించింది. కార్పొరేట్ సంస్థల ఉద్యోగులకు ఏమాత్రం తీసిపోకుండా తన యజమానిని లీవ్ కావాలని కోరుతూ వాట్సప్‌లో మెసేజ్ పంపింది. ఇంగ్లీషులో మెసేజ్ చేసి మరీ ఆమె సెలవు అడిగిన తీరు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. బెంగళూరుకు చెందిన ఒక మహిళ తన పనిమనిషి సెలవు అడిగే విధానాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆమె వాట్సాప్ చాట్ వైరల్ అవుతోంది. దీనిలో పనిమనిషి ఇంగ్లీషులో సెలవు కోరుతూ మెసేజ్ పంపుతుంది. ఈ పోస్ట్ చూసి, చాలా మంది నవ్వుకుంటున్నారు. దానికి ఫన్నీ రియాక్షన్లు ఇస్తున్నారు. తన ఇంట్లో పనిచేసే వ్యక్తి అనారోగ్యంతో ఉన్నప్పుడు లేదా సెలవు తీసుకోవాల్సినప్పుడు తాను చాలా స్పష్టమైన, ప్రొఫెషనల్ ఇంగ్లీషులో మెసేజ్ పంపుతానని ఆ మహిళ రాసింది. తన పనిమనిషి తాను ఆఫీసులో పనిచేసే వారి కంటే సెలవు తీసుకోవడంలో ఎక్కువ ప్రొఫెషనల్ అని ఆమె చెప్పింది. పనిమనిషి రాసిన మెసేజ్ ఆమె పదేళ్ల కుమార్తె టైప్ చేసిందని, ఆమె ప్రొఫెషనల్ భాషను చూస్తుంటే అది ఆఫీస్ ఈమెయిల్ లాగా అనిపిస్తుందని తెలిపింది. ఆమె తన లింక్డ్ఇన్ పోస్ట్‌లో స్క్రీన్‌షాట్‌ను కూడా షేర్ చేశారు. అందులో ‘నాకు బాగాలేదు. నాకు జలుబు, గొంతు నొప్పి ఉంది. కాబట్టి, నేను ఈ రోజు పనికి రావటం లేదు’ అని ఇంగ్లీషులో రాసి ఉంది.సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ పోస్ట్‌పై చాలా మంది స్పందించారు. చాలా మంది ఈ పోస్ట్‌ను లైక్ చేసి, తమ సొంత అనుభవాలను పంచుకున్నారు. మన దేశంలో పనిమనిషి ఎవరికీ తెలియజేయకుండా సెలవు తీసుకుంటారు. అప్పుడు పనిమనిషి రాలేదని, అందుకే నేను ఆలస్యం అయ్యానని మనం ఆఫీసులో బాస్‌కి వివరణ ఇచ్చుకోవాలి అంటూ ఒకరు రాశారు. మరొకరు సరదాగా, ‘నేను ఆఫీసులో సెలవు తీసుకున్నప్పుడు, కారణం కూడా చెప్పను, ఈ పనిమనిషి నాకంటే ప్రొఫెషనల్’ అంటూ వ్యాఖ్యనించారు. ఆ పనిమనిషి బాధ్యతాయుతమైన పనితీరుకు ప్రశంసలు కురిపిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇక.. ఇండియాలో ఇంద్రధనస్సు కనబడదా? వెలుగులోకి షాకింగ్ వాస్తవాలు
