Alert Hyderabad: అలెర్ట్ హైదరాబాద్.! ఐదు రాష్ట్రాల సరిహద్దుల్లో బంగ్లాదేశీయులు..

|

Aug 11, 2024 | 9:21 PM

బంగ్లాదేశ్‌లో హింస చెలరేగితే.. హైదరాబాద్ అలెర్ట్ అవుతోందా.? పోలీసులు నగరం మూల మూలలా నిఘా పెట్టారా..? ఎస్.. బంగ్లాదేశ్‌లో తలెత్తిన హింసాత్మక పరిస్థితులతో అక్కడ సర్వం కోల్పోయిన మైనార్టీలు.. ఇప్పుడు ఇండియా వైపే చూస్తున్నాురు. సరిహద్దుల్లో నిత్యం వస్తున్న వందలాది మందిని బోర్డర్ ఆఫ్ సెక్యూరిటీ ఫోర్స్ అడ్డుకొని వెనక్కు పంపించేస్తోంది. నిజానికి 2 దేశాల మధ్య ఉన్న సరిహద్దు పొడవు సుమారు 4వేల 96 కిలోమీటర్లు.

బంగ్లాదేశ్‌లో హింస చెలరేగితే… హైదరాబాద్ అలెర్ట్ అవుతోందా..? పోలీసులు నగరం మూల మూలలా నిఘా పెట్టారా..? ఎస్.. బంగ్లాదేశ్‌లో తలెత్తిన హింసాత్మక పరిస్థితులతో అక్కడ సర్వం కోల్పోయిన మైనార్టీలు.. ఇప్పుడు ఇండియా వైపే చూస్తున్నాురు. సరిహద్దుల్లో నిత్యం వస్తున్న వందలాది మందిని బోర్డర్ ఆఫ్ సెక్యూరిటీ ఫోర్స్ అడ్డుకొని వెనక్కు పంపించేస్తోంది. నిజానికి 2 దేశాల మధ్య ఉన్న సరిహద్దు పొడవు సుమారు 4వేల 96 కిలోమీటర్లు. దేశంలోని బెంగాల్, అస్సాం, మేఘాలయా, త్రిపుర, మిజోరాం ఈ ఐదు రాష్ట్రాలు నేరుగా కనెక్ట్ అయి ఉంటాయి. వీటిల్లో బెంగాల్ రాష్ట్రం అత్యధికంగా 2216.7 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటోంది. దీంతో ఈ ఐదు రాష్ట్రాల సరిహద్దులపై గట్టి నిఘా కొనసాగుతోంది. ఇక ఒడిషా పరిస్థితి మరోలా ఉంటుంది. బంగ్లాదేశ్‌ నుంచి సముద్ర మార్గం ద్వారా కేవలం 4-5 గంటలు ప్రయాణిస్తే చాలు నేరుగా ఒడిషాలోని కేంద్ర పారా, భద్రక్, బాలాసోర్ జిల్లాలకు చేరుకోవచ్చు. దీంతో మెరైన్ పోలీసులు సముద్ర సరిహద్దులపై గట్టి నిఘా పెట్టారు.

బంగ్లాదేశ్‌ నుంచి బెంగాల్, ఒడిషా చేరుకునే చాలా మంది అక్రమ చొరబాటుదార్లు.. ఉపాధి కోసం హైదరాబాద్‌ రావడం గతంలో చాలా సార్లు జరిగింది. అలా ఇక్కడ అక్రమంగా నివసించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కూడా. ఇక్కడ భవన నిర్మాణ కార్మికులుగా, ఫ్యాక్టరీల్లో పని వాళ్లగా, హ్యాకర్లుగా ఇలా రకరకాలుగా ఎలాంటి గుర్తింపు లేకుండానే వచ్చి ఉండిపోతుంటారు. ముఖ్యంగా బెంగాల్, ఒడిషా రాష్ట్రాలకు అక్రమంగా చేరుకొని అక్కడ నుంచి హైదరాబాద్ చేరుకుంటూ ఉంటారు. దీంతో హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషనల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానితుల గుర్తింపు కార్డులు చెక్ చేస్తూ.. అక్రమ చొరబాట్లకు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సాధారణంగా ముస్లిం కమ్యూనిటీ అధికంగా ఉండే ప్రాంతాలపై సహజంగానే బంగ్లాదేశీయుల ఫోకస్ ఉంటుంది. దీంతో బాలాపూర్, కాటేదాన్,ఫలక్‌నుమా, పహాడీ షరీఫ్ తదితర ప్రాంతాల్లో స్థానికులతో పోలీసులు మాట్లాడారు. ఆయా ప్రాంతాల్లోకి కొత్తగా ఎవరైనా వచ్చినా, అనుమానితులు కనిపించినా వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on