బాధితులకు వైద్యసేవల కోసం డాక్టర్‌ సాహసం.. నెటిజన్ల ప్రశంసలు

Updated on: Oct 09, 2025 | 8:48 PM

కొందరు వైద్యులు తమ చేష్టలతో వైద్య వృత్తికే కలంకం తెచ్చే విధంగా ప్రవర్తిస్తారు. మరికొందరు మాత్రం వృత్తి ధర్మం కోసం ఎంతటి సాహసానికైనా వెనుకాడరు. అలాంటి ఓ డాక్టర్‌కి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కొండచరియలు విరిగిపడిన ఘటనలో తీవ్రంగా గాయపడిన వారికి చికిత్స చేసేందుకు ఆ వైద్యుడు పెద్ద సాహసమే చేశాడు.

అతని నిబద్ధతకు నెట్టింట ప్రశంసలు కురుస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో భారీ వర్షాలకు వరదలు సంభవించాయి. పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో సుమారు 28 మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. క్షతగాత్రులకు చికిత్స చేసేందుకు వెళ్లడానికి ఓ వైద్యుడు పెద్ద సాహసమే చేశాడు. రోడ్డు మార్గం తెగిపోవడంతో వైద్య సహాయం అందించేందుకు అక్కడకు చేరుకునేందుకు ఎలాంటి అవకాశం లేకపోయింది. దీంతో నాగరకత బ్లాక్ ఆరోగ్య అధికారి ఇర్ఫాన్.. ప్రమాదస్థలి వద్దకు చేరుకునేందుకు ధైర్యం చేసి ముందుకు వచ్చారు. రెస్క్యూ సిబ్బంది సహాయంతో జిప్‌లైన్‌ ద్వారా లోయను దాటి అక్కడకు చేరుకున్నారు. కొండచరియలు విరిగిపడటంతో గాయపడిన వారికి చికిత్స అందించారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో ఆ డాక్టర్‌ సాహసాన్ని, విధి నిర్వహణ పట్ల ఆయన అంకితభావాన్ని పలువురు ప్రశంసించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కోనసీమలో భారీ అగ్నిప్రమాదం… ఆరుగురు సజీవ దహనం

PM Kisan Money: పీఎం కిసాన్ 21వ విడత… మీరు అర్హులా కాదా? ఇలా చెక్ చేసుకోండి

దివాలా తీశాడ‌ని భార్య వ‌దిలేసింది.. క‌ట్ చేస్తే

నా భార్య పాము.. రాత్రి కాగానే కాటేస్తోంది

ఇక.. ఈపీఎఫ్ కనీస పింఛన్ రూ. 2500.. ఆ రోజే నిర్ణయం