మ్మానాన్నలకు ఊహించని గిఫ్ట్‌ ఇచ్చిన యూట్యూబర్‌

Updated on: Feb 03, 2026 | 12:44 PM

తమ కన్నవారికి గొప్ప అనుభూతిని అందించాలనుకున్న యూట్యూబర్ ధర్మేంద్ర బిలోటియా తన తల్లిదండ్రులకు హెలికాప్టర్ రైడ్‌తో సర్‌ప్రైజ్ ఇచ్చాడు. తొలిసారి హెలికాప్టర్ ఎక్కిన తల్లిదండ్రుల ఆనందం, భావోద్వేగ క్షణాలు వీడియోగా మారాయి. వస్తువుల కంటే అనుభవాలే గొప్పవని నిరూపించిన ఈ వీడియో సోషల్ మీడియాలో మిలియన్ల మంది హృదయాలను గెలుచుకుంది.

తమ పిల్లల క్షేమం కోసం తల్లితండ్రులు ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. పిల్లలు ప్రయోజకులుగా ఎదిగినప్పుడే తల్లిదండ్రులకు నిజమైన ఆనందం. తనను కష్టపడి పెంచిన పేరంట్స్‌కు సర్ ప్రైజ్ ఇవ్వాలనుకున్నాడు ఓ యూట్యూబర్‌. కన్నవారికి ఊహించని సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. వారిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు మరపురాని క్షణాలను అందించాడు. యూట్యూబర్ ధర్మేంద్ర బిలోటియా తన తల్లిదండ్రులకు హెలికాప్టర్ రైడ్‌తో సర్‌ప్రైజ్ ఇచ్చాడు. తల్లిదండ్రులకు తొలిసారి హెలికాప్టర్ ఎక్కించాడు. ఈ భావోద్వేగ క్షణాలను వీడియోలో రికార్డు చేసి.. సోషల్ మీడియాలో మిలియన్ల మంది హృదయాలను గెలుచుకున్నాడు. ధర్మేంద్ర బిలోటియా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో ఆయన తన తల్లిదండ్రుల మధ్య నిలబడి ఉండగా.. వెనుక హెలికాప్టర్ కనిపిస్తుంది. వీడియో ప్రారంభంలో.. ఆ ప్రయాణం గురించి ఎలా అనిపించిందని ఆయన తన తల్లిదండ్రులను అడగ్గా.. వారు బాగుందంటూ సమాధానం ఇచ్చారు. ఈ వీడియో చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. హెలికాప్టర్‌లో ధర్మేంద్ర తల్లిదండ్రులు పక్కపక్కనే కూర్చుని.. కిటికీలోంచి కనిపిస్తున్న అద్భుతమైన ఆకాశ దృశ్యాలను చూస్తూ ఎంతో సంతోషంగా కనిపించారు. ‘‘ఒకప్పుడు గ్రామ పొలాల్లో నిలబడి ఆకాశంలో ఎగిరే హెలికాప్టర్ల వైపు చూసిన తన తల్లిదండ్రులు.. ఈ రోజు అదే హెలికాప్టర్ లోపల కూర్చున్నారు. మట్టి నుంచి ఆకాశపు ఎత్తులకు చేరుకున్నారు’’ అంటూ ధర్మేంద్ర ఈ వీడియోకు ఒక భావోద్వేగ క్యాప్షన్ ఇచ్చాడు. తమ తల్లిదండ్రులు ఎన్నడూ ఊహించని కలను నిజం చేసిన కొడుకు పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో 50 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. తల్లిదండ్రులకు కేవలం వస్తువులను బహుమతిగా ఇవ్వడం కంటే, ఇలాంటి మధురమైన అనుభూతులను అందించడం గొప్ప విషయమని వేల సంఖ్యలో కామెంట్స్ పెడుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రోజుకు రూ.21 వేల సంపాదన.. జస్ట్‌ అదే చేసిన ఇన్‌ఫ్లూయెన్సర్‌

భారతీయ రైల్వేలో పెను మార్పు.. ఇకపై LNGతో రైళ్ల ప్రయాణం

నడిరోడ్డుపై షాకింగ్‌ సీన్.. ఆవు తో మందు బాబు చేసిన పనికి అందరికీ మైండ్ బ్లాక్

బిడ్డకు పాలిస్తున్న తల్లి.. క్షణాల్లో..

ఏపీ సహా 4 రాష్ట్రాల్లో రేర్ ఎర్త్ మినరల్స్ కోసం పథకం