Viral: 2.5కోట్ల విలువైన భూమిని దానం చేసిన బామ్మ !!
హర్యానాలోని ఫతేహాబాద్‌కు చెందిన చావ్లీదేవి అనే 80ఏళ్ల వృద్ధురాలు గొప్పమనసు చాటుకుంది. ప్రస్తుతం సమాజానికి ఆమె ఆదర్శంగా నిలిచింది. చావ్లీ దేవి తన 12 ఎకరాల భూమిని గోశాలకు విరాళంగా ఇస్తూ నిర్ణయం తీసుకుంది.
హర్యానాలోని ఫతేహాబాద్‌కు చెందిన చావ్లీదేవి అనే 80ఏళ్ల వృద్ధురాలు గొప్పమనసు చాటుకుంది. ప్రస్తుతం సమాజానికి ఆమె ఆదర్శంగా నిలిచింది. చావ్లీ దేవి తన 12 ఎకరాల భూమిని గోశాలకు విరాళంగా ఇస్తూ నిర్ణయం తీసుకుంది. దాదాపు 2.5 కోట్ల విలువైన భూమిని గోశాలకు దానంగా ఇస్తు నిర్ణయం తీసుకుంది. కాగా, వీరికి సంతానం లేరు. ఆవుల పోషణ కోసం తన భూమిని దానంగా ఇవ్వాలను కుంది. చావ్లీ దేవి, భర్త మాణిక్ రామ్‌కు 21 న్నర ఎకరాల భూమి ఉంది. అయితే, ఆమెకు గోవులకు సేవ చేయడం అంటే ఎంతో ఆసక్తి. దీంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బంధువులు కూడా చావ్లీకి భూమిని దానంగా చేయాలంటూ సూచించినట్లు తెలుస్తోంది. వీరి సూచనలు కూడా తీసుకొని ఆమె భూమిని దానం చేసింది. మొదటి నుంచి ఆమెకు ఆవులకు సేవ చేయడం అంటే ఎంతో ఇష్టం.తాను తీసుకున్న నిర్ణయం పట్ల చావ్లీ దేవి ఆనందం వ్యక్తం చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
8వ అంతస్తుపై వేలాడుతున్న పాపను.. హీరోలా రక్షించిన వ్యక్తి
అడవిలో అద్భుత దృశ్యం.. ఒకే చోట జింకలు, చిరుత నీళ్లు తాగుతూ..
రెండు తలల అరుదైన పాము.. దీని ఆయుర్దాయం ఎంతో తెలిస్తే షాకే..