వానర యుద్ధం అంటే ఇదే.. భయంతో ప్రజలు పరుగో పరుగు

Updated on: Nov 10, 2025 | 5:11 PM

హనుమకొండ జిల్లా నేరేళ్ల గ్రామంలో వేలాది కోతులు రెండు వర్గాలుగా విడిపోయి భీకరంగా ఘర్షణపడ్డాయి. ఈ "వానర యుద్ధం" చూసి గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు, ఇళ్లలోనే ఉండిపోయారు. కోతుల కీచులాటతో రణరంగంగా మారిన గ్రామంలో, తమపై దాడి జరుగుతుందేమోనని ఆందోళన చెందారు. అటవీ శాఖ అధికారులు కోతుల బెడద నుండి రక్షణ కల్పించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.

రామ,రావణ యుద్ధంలో వానరసేనలు పాల్గొని యుద్ధం చేశాయని రామాయణంలో చదువుకున్నాం…కానీ చూడలేదు. అయితే వేలాది కోతులు ఒకేచోట చేరి ఘర్షణపడితే ఎలా ఉంటుంది.. వానర యుద్ధం కూడా ఇలాగే ఉంటుందేమో అనిపిస్తుంది. హనుమకొండ జిల్లాలో అదే జరిగింది. వేలాది కోతులు.. ఓ గ్రామాన్ని రణరంగంగా మార్చేశాయి. విపరీతమైన కోపంతో, ఆ వానరాలు ఒకదాని మీద మరొకటి దాడి చేసుకున్న తీరు చూసి గ్రామస్తులు హడలిపోయారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం నేరేళ్ల గ్రామంలో జరిగిన ఈ ఘటన చూస్తే జంతువుల్లోనూ గ్రూప్‌ వార్‌లు ఉంటాయా అనిపించక మానదు. గ్రామంలోకి వేలాదిగా దండెత్తి వచ్చిన కోతులు రెండు వర్గాలుగా విడిపోయి ఒకదానిపై ఒకటి దాడిచేసుకున్నాయి. రెండు గ్రూపుల మధ్య భీకర వార్ జరిగింది. ఓ ఇంటి పైకి చేరిన రెండు వర్గాల కోతుల దాడిలో పరస్పరం గాయపరచుకున్నాయి. కోతుల కీచులాటతో అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. వేరు వేరు ప్రాంతాల నుండి వచ్చిన కోతుల మధ్య ఘర్షణ వాతావరణం చూసి గ్రామస్తులు తమపై ఎక్కడ దాడిచేస్తాయోనని ఆందోళనకు గురయ్యారు. ఆ సమయంలో గ్రామస్తులంతా బిక్కుబిక్కుమంటూ తలుపులు వేసుకుని ఇళ్లలోనే గడిపారు. వేళాపాళా లేకుండా ఇలా గుంపులు గుంపులుగా తమ గ్రామం మీద పడుతున్న కోతుల నుంచి తమకు రక్షణ కల్పించాలని గ్రామస్తులు అటవీ శాఖ అధికారులను వేడుకుంటున్నారు. వేలాది కోతులను చూసి తీవ్ర భయాందోళన చెందిన గ్రామస్తులు కోతుల బెడద నుండి విముక్తి కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హే కోతి లెవ్! అది బండరాయి కాదే.. బట్టతల.. దిగు.. దిగు

ఈ సారి బైక్ మీద కాదు.. ఆటోలోనే రచ్చ రచ్చ చేసిన జంట..

పాలు తెస్తానని వెళ్లి.. డ్యామ్‌లో

రచ్చ రచ్చగా మిస్ యూనివర్స్‌ భామల వాకౌట్‌తో షాక్‌

అవిభక్త కవల పాములను చూశారా ??