క్షుద్రపూజల కలకలం.. శివారులో భయానక దృశ్యాలు !!

Updated on: Mar 13, 2026 | 6:06 PM

హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో గుర్తుతెలియని వ్యక్తులు పొట్టేలును బలిచ్చి క్షుద్రపూజలు నిర్వహించారు. అర్ధరాత్రి గ్రామ పొలిమేరలో జరిగిన ఈ ఘటన స్థానికంగా భయాందోళనలు రేపింది. చేతబడి జరిగిందేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు ఇది మూఢనమ్మకాలేనని భరోసా ఇచ్చినా, ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

హనుమకొండ జిల్లాలోని కమలాపూర్ మండలంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. వంగపల్లి క్రాస్ రోడ్డు వద్ద గుర్తుతెలియని వ్యక్తులు పొట్టేలును బలిచ్చి క్షుద్రపూజలు నిర్వహించారు. ఈ ఘటన స్థానిక ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. అర్ధరాత్రి వేళ గ్రామ పొలిమేరల్లోని నాలుగు దారుల కూడలి వద్ద క్షుద్ర శక్తులను ప్రసన్నం చేసుకునేందుకు ఈ పూజలు చేసినట్లు ఆనవాళ్లు కనిపించడంతో స్థానికంగా భయం నెలకొంది. ముఖ్యంగా రోడ్డుపై పొట్టేలును బలిచ్చి, దాని తల మరియు మొండెంను వేరు చేసిన తీరు చూసి స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఘటనా స్థలంలో పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, కొబ్బరికాయలు కొట్టి క్షుద్ర పూజలు నిర్వహించినట్లు గుర్తించారు. ఉదయాన్నే ఆ మార్గంలో వెళ్తున్న ప్రయాణికులు, రైతులు ఈ భయానక దృశ్యాలను చూసి బెంబేలెత్తిపోయారు. ఏదో చేతబడి జరిగిందని, తమ గ్రామానికి ఏం కీడు జరుగుతుందోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షించారు. ఇవన్నీ కేవలం మూఢనమ్మకాలతో కొందరు మూర్ఖులు చేసే పనులేనని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. అయితే, జనసంచారం ఉన్న రోడ్లపై ఇలాంటి భీభత్సమైన దృశ్యాలతో భయాందోళనలు కలిగించే వారిని గుర్తించి, కఠినంగా శిక్షించాలని వంగపల్లి గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గ్యాస్‌ ఎఫెక్ట్‌.. అయోధ్యలో భక్తులకు భోజన కష్టాలు

తల్లి కోసం భారత్ వస్తే .. మూసుకుపోయిన అమెరికా దారులు..

“అమ్మా.. తిరిగి వస్తానో లేదో తెలీదు” రెస్క్యూ మిషన్‌కు ముందు పైలెట్ మాటలు

Loading...
Unable to load recommendations.
Follow Us