Telugu Man Married Turkey Woman: గుంటూరు అబ్బాయి , టర్కీ అమ్మాయి ఒక్కటైన వేళ..ఎట్రాక్ట్ చేస్తున్న వీడియో..

|

Jan 21, 2022 | 10:13 PM

Hindu Marriage: నిజమైన ప్రేమకు జాతి మతం, కులం. ప్రాంతం ఇవేమీ అడ్డుకావని మరోసారి నిరుపించారు ఈ కొత్త జంటలు.. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ ఇద్దరు యువకులు వృత్తి రీత్యా విదేశాల్లో ఉద్యోగం చేస్తూ.. అక్కడ యువతులను ప్రేమించారు..

Hindu Marriage: నిజమైన ప్రేమకు జాతి మతం, కులం. ప్రాంతం ఇవేమీ అడ్డుకావని మరోసారి నిరుపించారు ఈ కొత్త జంటలు..  ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ ఇద్దరు యువకులు వృత్తి రీత్యా విదేశాల్లో ఉద్యోగం చేస్తూ.. అక్కడ యువతులను ప్రేమించారు.. తమప్రేమను పెద్దల అంగీకారంతో వివాహ బంధంగా మార్చుకున్నారు. హిందూ సాంప్రదాయ పద్దతిలో మూడు ముళ్ళు ఏడు అడుగులతో కొత్తగా దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ పట్నం ఓ పెళ్లి వేడెక్కి వేదిక కాగా.. మరో పెళ్లి గుంటూరు అయ్యింది. వివరాల్లోకి వెళ్తే..

విశాఖ పట్నం జిల్లా కె.కోటపాడు మండలం కింతాడ గ్రామ సర్పంచ్‌ బండారు ఈశ్వరమ్మ, ముత్యాలనాయుడు కుమారుడు నరేష్‌.. రష్యాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడ తనతో పాటు ఉద్యోగం చేస్తున్న రష్యాకు చెందిన యువతి ఇరీనాతో ప్రేమలో పడ్డాడు. తమ ప్రేమను ఇరువురు తల్లిదండ్రులకు చెప్పి.. ఒప్పించి హిందూ సంప్రాదయ పద్దతిలో పెళ్లి చేసుకున్నారు. వరుడు స్వగ్రామం కింతాడలో నరేష్, ఇరీనాల పెళ్లి వేడుక బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్ళికి ఇరీనా తల్లిదండ్రులు ఆండ్రీ, నేతాలియా భారతీయ సాంప్రదాయ దుస్తులను ధరించి స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. ఇరీనా తల్లి ఆండ్రీ కూడా పట్టు చీరను ధరించి సందడి చేశారు. నరేష్ తల్లి ఈశ్వరమ్మ గ్రామ సర్పంచ్. దీంతో ఈ పెళ్లి వేడుకక్కి వైసీపీ శ్రేణులు కూడా హరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Published on: Jan 21, 2022 09:19 PM