గొంతులో 22 కత్తులను దింపి గిన్నీస్‌ రికార్డు కొట్టాడు.. కానీ..

|

Jan 15, 2025 | 2:04 PM

ఇతడు ప్రపంచంలో ఎవరూ చేయలేని సాహసం చేసి ప్రపంచ రికార్డు సాధించాడు. నోట్లో ఏకంగా 22 కత్తులు పెట్టుకొని రికార్డు సాధించి అందరినీ అబ్బురపరిచాడు. అలాంటి సాహసికి ఇప్పుడు రెండు పూటల తిండి దొరకడం లేదు. కుటుంబాన్ని పోషించడం కష్టంగా మారింది. తనను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాడు.

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్నకల్వలకు చెందిన ఆవుల కిషన్ 30 యేళ్లుగా సాహస విన్యాసాలు చేస్తున్నాడు. ముంబాయ్, ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో కూడా ప్రదర్శనలు చేశాడు. అయితే గత రెండేళ్లుగా స్టేజ్ షోలు తగ్గాయి. దీంతో స్వగ్రామానికి చేరుకొని కూలీ పనులు చేస్తున్నాడు. ఈయనకు ఐదుగురు కుమార్తెలు. ప్రపంచ రికార్డు సాధించినప్పటికీ తనకు కడుపు నిండా అన్నం దొరకడం లేదని ఆవేదన చెందుతున్నాడు. దుబాయ్ లాంటి దేశాల్లోనూ అద్భుతమైన ప్రదర్శనలు చేశాడు. నోట్లో అవలీలగా 22 కత్తులు పెట్టుకుంటాడు. కత్తులు నోట్లో పెట్టుకొని మళ్లీ చేతులతోనూ విన్యాసాం చేస్తాడు.. ఈ విధంగా కత్తులు నోట్లో పెట్టుకొని సాహసం చేయడం చాలా అరుదు. దేశంలో కిషన్ మాత్రమే ఇలాంటి సాహస న్యాసాలు చేస్తున్నాడు. దీని వెనుక ఎంతో సాధన ఉంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: సంక్రాంతిని మడతెట్టిన వెంకీ | 2nd డే దిమ్మతిరిగే వసూళ్లు డాకు విశ్వరూపం