గ్రిల్డ్ చికెన్‌లో నో ‘లెగ్ పీస్’.. రెస్టారెంట్‌కు 15 వేల ఫైన్ వీడియో
మనలో చాలామంది వారానికి ఒకసారో లేదా నెలకు ఒకసారైనా హోటల్ లేదా రెస్టారెంట్ కు వెళ్లి భోజనం చేస్తాం. అక్కడ దొరికే ఫుడ్ మన ఇంట్లో వండుకోవడం చాలా కష్టం. అంత టైం కూడా ఉండదు. కాబట్టి రుచిగా ఏదైనా స్పెషల్ ఫుడ్ తినాలనుకునేవారు రెస్టారెంట్ లోకి వెళ్లి తింటారు. వీకెండ్ లో చాలామంది ఇంటి ఆహారం కాస్త బోర్ కొట్టి రెస్టారెంట్ లోకి వెళ్తారు.
స్నేహితులతో లేదా కుటుంబంతో కలిసి భోజనం చేయడానికే ఇష్టపడతారు. రెస్టారెంట్ లో ఇంట్లో లేని ప్రత్యేక వంటకాలు రుచిగా దొరుకుతాయి. అయితే కోయంబత్తూరుకు చెందిన క్రిస్టోఫర్ ఎడిసన్ కూడా ఇలాగే తన కుటుంబ సభ్యులతో కలిసి స్థానికంగా ఓ బిర్యాని రెస్టారెంట్ కు జనవరి 14 వ తేదిన వెళ్ళాడు. తందురి చికెన్, గ్రిల్డ్ చికెన్ ఆర్డర్ చేశాడు. అయితే గ్రిల్డ్ చికెన్ లో లెగ్ పీస్ లేకపోవడంతో సిబ్బందిని ప్రశ్నించాడు. దానికి వారు అతడికి సరదా చెప్పడం పోయి దూషిస్తూ బెదిరింపులకు దిగారు. ఎవరికీ చెప్పుకుంటావో చెప్పుకోపో అంటూ నిర్లక్ష్యంగా వదిలేశారు. దీంతో రెస్టారెంట్ సిబ్బంది కుటుంబ సభ్యుల ముందు తన పరువు తీశారని క్రిస్టోఫర్ అవమానంగా ఫీల్ అయ్యాడు. కుటుంబ సభ్యుల ఎదుట జరిగిన ఈ బెదిరింపుతో తాను మానసిక క్షోభ అనుభవించానని అతడు కన్జ్యూమర్ ఫోరం లో ఫిర్యాదు చేశాడు. రెస్టారెంట్ బిల్లు 1196 రూపాయలు అయిందని ఆ మొత్తంతో పాటు తన మానసిక క్షోభకు నష్టపరిహారం ఇప్పించాలని అభ్యర్థించాడు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన చెన్నై కన్జ్యూమర్ కోర్టు గ్రిల్డ్ చికెన్ లో లెగ్ పీస్ లేకుండా వడ్డించిన రెస్టారెంట్ యాజమాన్యానికి 10,000 రూపాయల జరిమానా విధించింది. కేసు ఖర్చులకు మరో 5000 రూపాయలు కలిపి మొత్తం 15,000 రూపాయలు కస్టమర్ కు ఇవ్వాలని ఆదేశించింది.
మరిన్ని వీడియోల కోసం :
