చనిపోయిన‌ నాలుగేళ్లకు సర్కార్ కొలువు.. కన్నీరుమున్నీరైన కుటుంబం

|

Jun 25, 2024 | 6:30 PM

సర్కార్ కొలువు‌ సాధించడమే లక్ష్యంగా ఆరేళ్లు‌ కష్టపడ్డాడు. కానీ ఆ కొలువు రాకపోవడం వల్ల మనస్తాపంతో ఆ యువకుడు మృతి చెందాడు. కానీ ఆ తరువాత నాలుగేళ్లకు ప్రభుత్వం ఉద్యోగం వెదుక్కుంటూ వచ్చింది. ఉద్యోగం లో చేరాలంటూ ఇంటికి ఉత్తరం వచ్చింది. కానీ ఆ యువకుడు చనిపోయాడని తెలిసి, సమాచారం తెచ్చిన పోస్ట్ మ్యాన్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ ఘటన మంచిర్యాల‌ జిల్లాలో చోటు చేసుకుంది.

సర్కార్ కొలువు‌ సాధించడమే లక్ష్యంగా ఆరేళ్లు‌ కష్టపడ్డాడు. కానీ ఆ కొలువు రాకపోవడం వల్ల మనస్తాపంతో ఆ యువకుడు మృతి చెందాడు. కానీ ఆ తరువాత నాలుగేళ్లకు ప్రభుత్వం ఉద్యోగం వెదుక్కుంటూ వచ్చింది. ఉద్యోగం లో చేరాలంటూ ఇంటికి ఉత్తరం వచ్చింది. కానీ ఆ యువకుడు చనిపోయాడని తెలిసి, సమాచారం తెచ్చిన పోస్ట్ మ్యాన్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ ఘటన మంచిర్యాల‌ జిల్లాలో చోటు చేసుకుంది. సింగరేణి ప్రాంతం మందమర్రి ఫస్ట్ జోన్ కి చెందిన సిద్దెంకి మొండయ్య-సరోజ దంపతులకు నవీన్ కుమార్, అనూష, ఆదిత్య, జీవన్ కుమార్ నలుగురు సంతానం. వారిలో ఇద్దరు కుమార్తెలు మానసిక దివ్యాంగులు. జీవన్ కుమార్ 2014లో ఐటీఐ పూర్తి చేశారు. 2018 లో వెలువడిన విద్యుత్ శాఖ లైన్ మెన్ పోస్ట్ కు అప్లై చేశాడు. పరీక్ష కూడా రాసి ఫలితాల కోసం ఎదురు చూశాడు. అదే సమయంలో అనారోగ్యంతో అక్క ఆదిత్య 2018 లోను… తల్లి సరోజ 2019లోను మృతి చెందారు. వరుస విషాదాలు ఓ వైపు, ఉద్యోగం రావడం లేదన్న మనోవేదన మరోవైపు జీవన్ కుమార్ ను కుంగదీశాయి. సింగరేణిలోనూ ఉద్యోగానికి ప్రయత్నించి విఫలమవడంతో 2020 మార్చి 15న ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. జీవన్ మృతి చెందిన ఏడాదికే అక్క అనూష, తండ్రి మొండయ్య సైతం మృతి చెందడం ఆ ఇంటిని మరింత విషాదంలోకి నెట్టేసింది. చివరకు పెద్దకొడుకు నవీన్ ఒక్కడే మిగిలాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం జీవన్ కుమార్ ను వెదుక్కుంటూ వచ్చిన ఫోస్ట్ మ్యాన్.. అతడికి ప్రభుత్వం ఉద్యోగం వచ్చిందని నవీన్ కుమార్ కు లెటర్ అందించాడు. మా తమ్ముడు చనిపోయి‌ నాలుగేళ్లైందంటూ నవీన్ కన్నీరు మున్నీరయ్యాడు. శుభవార్త మోసుకొచ్చానని భావించిన ఫోస్ట్ మ్యాన్ సైతం.. ప్రభుత్వ ఉద్యోగ కాల్ లెటర్ అందుకోవాల్సిన వ్యక్తి నాలుగేళ్ల క్రితమే చనిపోయాడని తెలిసి కన్నీళ్లు‌ పెట్టుకున్నాడు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గ్రాడ్యుయేట్‌ అయితే నేరుగా గ్రీన్‌ కార్డు.. ట్రంప్‌ అనూహ్య ప్రతిపాదన

హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమల’ విడుదల.. కారణమేంటంటే ??

బాత్రూం నుంచి వింత శబ్దాలు.. ఏంటా అని చూసినవారికి షాక్‌

రూ.224 కోట్ల సంపద దానం చేసిన యువతి !! ఎందుకంటే??

లైంగిక దాడి, అక్రమ సంబంధాల కేసుల్లో అబార్షన్లకు ఓకే

Follow us on