Gold Smuggling: రూటు మార్చిన స్మగ్లర్లు.! సముద్ర మార్గంలో సినిమా తరహాలో ఛేజింగ్..
గోల్డ్ స్మగ్లింగ్‌పై ఎంత నిఘా పెట్టినా.. ఏదో ఒక రూపంలో అక్రమ రవాణా సాగుతూనే ఉంది. ఇప్పటివరకు విమానాల్లోనే బంగారం అక్రమ తరలింపు చూశాం. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు.. దొంగతనంగా బంగారం తీసుకురావడం, ఎయిర్‌పోర్టుల్లో దొరికిపోవడం కొన్నేళ్లుగా జరుగుతూనే ఉంది. కానీ.. బంగారం స్మగ్లింగ్‌కు కొత్త దారులు ఎంచుకుంటున్నారు స్మగ్లర్లు. శ్రీలంక నుంచి తమిళనాడుకు తరలిస్తున్న బంగారాన్ని సీజ్ చేశారు.
గోల్డ్ స్మగ్లింగ్‌పై ఎంత నిఘా పెట్టినా.. ఏదో ఒక రూపంలో అక్రమ రవాణా సాగుతూనే ఉంది. ఇప్పటివరకు విమానాల్లోనే బంగారం అక్రమ తరలింపు చూశాం. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు.. దొంగతనంగా బంగారం తీసుకురావడం, ఎయిర్‌పోర్టుల్లో దొరికిపోవడం కొన్నేళ్లుగా జరుగుతూనే ఉంది. కానీ.. బంగారం స్మగ్లింగ్‌కు కొత్త దారులు ఎంచుకుంటున్నారు స్మగ్లర్లు. శ్రీలంక నుంచి తమిళనాడుకు తరలిస్తున్న బంగారాన్ని సీజ్ చేశారు. సముద్రంలో సినిమాటిక్ రేంజ్‌లో చేజింగ్ చేసి స్మగర్లను పట్టుకున్నారు.
రూట్ మార్చారు స్మగ్లర్లు. సముద్రమార్గం ద్వారా తమిళనాడుకు బంగారం తరలిస్తుండగా.. అడ్డంగా దొరికిపోయారు. శ్రీలంకలోని గల్పిటి థోరయాది నుంచి భారత్‌కు అక్రమంగా బంగారం రవాణా చేస్తున్నారన్న సమాచారంతో చెన్నై కోస్ట్ గార్డ్ సిబ్బంది.. స్మగ్లర్లను పట్టుకునేందుకు ప్రయత్నించగా.. బ్యాగ్‌ను సముద్రంలోకి విసిరేసి పారిపోయారు. దీంతో సముద్రంలోకి దూకి బంగారాన్ని బయటకు తెచ్చారు కోస్ట్ గార్డ్ సిబ్బంది. ఇదంతా అచ్చం సినిమాలో లాగా చేజింగ్ జరిగింది. చివరకు స్మగ్లర్స్ పడేసిన బ్యాగ్‌లో 4 కేజీల 700 గ్రాముల బంగారం ఉన్నట్లు గుర్తించారు. స్మగ్లర్స్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
గతంలోనూ ఇలాంటి ఘటనలే జరిగాయి. శ్రీలంక నుంచి బంగారం తెస్తున్నారన్న పక్కా సమాచారంతో డీఆర్ఐ అధికారులు, కస్టమ్స్ అధికారులు.. రెండ్రోజుల పాటు స్పెషల్ ఆపరేషన్ జరిపి 32 కిలోల గోల్డ్ పట్టుకున్నారు. అది కూడా తమిళనాడు తీరంలోనే జరిగింది. శ్రీలంక నుంచి భారత్‌కు బంగారం అక్రమంగా తరలిస్తున్నట్లు డీఆర్‌ఐ అధికారులకు సమాచారం అందింది. ఈ మేరకు నిఘా పెట్టగా.. తమిళనాడులోని మండపం ఫిషింగ్ హార్బర్ ప్రాంతంలో రెండు బోట్ల కదలికలు అనుమానాస్పదంగా ఉన్నట్లు గుర్తించారు. వాటిని వెంబడించగా.. తప్పించుకునే క్రమంలో ఓ పడవలోని ముగ్గురు స్మగ్లర్లు తమ వద్ద ఉన్న 11.6 కిలోల బంగారు కడ్డీలను సముద్రంలో విసిరేశారు. ప్రత్యేక ఆపరేషన్‌లో భాగంగా డైవర్లను రంగంలోకి దించి సముద్రంలో పారేసిన బంగారాన్ని వెలికితీశారు. మరో పడవలో 21 కిలోలకు పైగా బంగారాన్ని స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ రెండు ఘటనల్లో మొత్తం రూ.20 కోట్లకుపైగా విలువైన 32.6 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.