Gold in Sea: బీచ్‌లో బంగారం దొరుకుతుందట..! సముద్ర తీరానికి ఎగబడ్డ జనం..!

|

May 19, 2022 | 9:32 AM

మనషి ఆశకు హద్దు ఉండదు. ఎంత సంపాదించినా.. ఏదైనా సరే ఫ్రీగా వస్తుంది అంటే వదలరు. ఎంతటి రిస్క్ చేసైనా దక్కించుకోవాలనుకుంటారు. అందుకే అంటారు ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా వదలరు అని.. ఇప్పుడు అదే సీన్‌ రిఫీట్‌ అయ్యింది.


మనషి ఆశకు హద్దు ఉండదు. ఎంత సంపాదించినా.. ఏదైనా సరే ఫ్రీగా వస్తుంది అంటే వదలరు. ఎంతటి రిస్క్ చేసైనా దక్కించుకోవాలనుకుంటారు. అందుకే అంటారు ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా వదలరు అని.. ఇప్పుడు అదే సీన్‌ రిఫీట్‌ అయ్యింది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని ఉప్పాడ సముద్ర తీరంలో జనాల పరిస్థితి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ‘అసని’ తుపాను కొనసాగుతుంది. ఇది దిశను మార్చుకుని ఉత్తర ఈశాన్య కదులుతుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఇప్పటికే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ప్రజలను బయటకు రావొద్దని హెచ్చరించారు. ఇంత వరకు బాగానే ఉంది. అయితే, ఉప్పాడ బీచ్‌ సమీపంలో బంగారం దొరకుతుందనే ప్రచారం జోరందుకుంది. ఇది కాస్త ఆ నోట.. ఈ నోట పాకి చుట్టు పక్కల గ్రామాలకు పాకింది. దీంతో అక్కడి పరిసర ప్రాంతాల్లో ఉన్న జనాలు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఉప్పాడ బీచ్‌కు పోటెత్తారు.

తీరంలో బంగారం కోసం వేట మొదలుపెట్టారు. ఇక, స్థానిక మత్స్యకారులు తీరంలో బంగారం కోసం జల్లెడపడుతున్నారు. మహిళలు, చిన్నారులు సైతం తీరంలో బంగారం కోసం వెతుకులాట ప్రారంభించారు. ఈ విషయం గురించి స్థానికులు మాట్లాడుతూ.. తమ తాతల కాలం నుంచి పెద్ద ఎత్తున తుఫాన్లు వచ్చినపుడు సముద్రం నుంచి చిన్న బంగారు రేణువులు, వెండి వస్తువులు లాంటివి కొట్టుకు వస్తాయని వాటిని తీసుకునేందుకు జనాలు ఎగబడతారని చెప్పారు. గతంలోని రాజుల కోటలు, పలు దేవాలయాలు సముద్ర గర్భంలో కలిసిపోయాయని, వాటిలో ఉన్న వస్తువులు తుఫాన్ సమయాల్లో బయటపడుతున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు. ఇది తమకు కొత్తేమీ కాదని అంటున్నారు.మరోవైపు ఇదంతా నిజం కాదని అధికారులు అంటున్నారు. భారీగా కురుస్తున్న వర్షాలకు చాలా ఇల్లు కూలిపోవడం, చాలా మంది ప్రాణాలు కోల్పోవడం, అలా కొట్టుకువచ్చినవి సముద్రంలో కలవడంతో ఏదైనా బంగారం దొరికిందేమో కానీ.. సముద్రం లోపల నుండి బంగారం రావడం మాత్రం వాస్తవం కాదని చెబుతున్నారు. ఇలాంటి అసత్య ప్రచారాలు నమ్మవద్దని అధికారులు, పోలీసులు తెలిపారు. సముద్రం అల్లకల్లోలంగా ఉన్న ఈ సమయంలో ప్రజలు అక్కడికి వెళ్లడం మంచిది కాదంటున్నారు. బంగారం ఏమో గానీ జోరు వానలో ప్రాణాలు జాగ్రత్త అని సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Electrician Love: అబ్భా ప్రేమ ఎంత పనైనా చేయిస్తుంది అంటే ఇదే మరి..! గర్ల్‌ ఫ్రెండ్‌ కోసం ఎలక్ట్రీషియన్ వింత పని..!

Viral Video: దాని కోసం ఇలా చేస్తారా..? భర్త ఇంట్లో బాత్ రూమ్ లేదని భార్య ఆత్మహత్య..!

Follow us on