దూసుకెళ్తున్న బంగారం,వెండి ధరలు వీడియో
పసిడి ధరలు దూసుకెళ్తున్నాయి. రూపాయి బలహీనత ప్రభావవం, ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాలతో.. బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా స్వచ్ఛమైన పసిడి ధర ఏకంగా లక్షా 40 వేల మార్క్ కు చేరుకుంది. వారం రోజుల్లోనే బంగారం ధర దాదాపు 4వేల వరకు పెరిగింది. అయితే.. అంతర్జాతీయంగా పసిడి ధరలు భారీగా పెరుగుతుండటంతో దేశీయంగా కూడా పెరుగుతున్నాయని, మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
డిసెంబరు 24 బుధవారం కూడా బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.380 పెరిగి రూ. 1,38,930 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.350 పెరిగి రూ.1,27,350లకు చేరింది. వెండి కిలోకి రూ.10,000 పెరిగి రూ.2,44,000 పలుకుతోంది. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,39,080 , పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,27,500 పలుకుతోంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,38,930 ఉంటే, 22 క్యారెట్ల బంగారం రూ.1,27,350 పలుకుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,39,640, ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,000 గా ఉంది. కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,38,930, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,27,350 పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,38,930 ఉంటే.. 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,27,350 పలుకుతోంది. కిలో వెండి ధర రూ.2,44,000 పలుకుతోంది.
మరిన్ని వీడియోల కోసం :
స్టార్ హీరోలు కూడా భయపడుతుంటే.. కాజల్ ఒక్కతే ధైర్యంగా కామెంట్ చేసింది వీడియో
