బ్రేకప్ లీవ్ అడిగిన ఉద్యోగి.. సీఈవో రియాక్షన్‌ ఏంటంటే..

Updated on: Oct 31, 2025 | 12:13 PM

అనారోగ్యం వల్లో వ్యక్తిగత పనుల కోసమో లీవు పెట్టడం సాధారణం. క్రికెట్ మ్యాచ్ చూడడం కోసం లేని అనారోగ్యాన్ని కొని తెచ్చుకుని సెలవు మెయిల్‌ పంపే ఉద్యోగులూ కోకొల్లలు. అయితే, ఓ ఉద్యోగి మాత్రం ప్రియురాలితో తనకు బ్రేకప్ అయిందని, ఆ బాధ నుంచి కోలుకోవడానికి కొన్ని రోజులు సెలవు కావాలని కంపెనీ సీఈవోకు మెయిల్ చేశాడు. ఈమెయిల్ అందుకున్న సీఈవో ఆశ్చర్యపోయారు.

నాట్‌ డేటింగ్‌ అనే సంస్థ సీఈవో జస్వీర్ సింగ్‌.. ఆ లీవ్ లెటర్ ను స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ‘తన వృత్తి జీవితంలో అందుకున్న అత్యంత నిజాయతీతో రాసిన లీవ్‌ అప్లికేషన్ ఇదే’ అంటూ క్యాప్షన్ జోడించారు. ఈ పోస్టు కాస్తా వైరల్ గా మారింది. తన సంస్థలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి తనకు బ్రేకప్ అయ్యిందని, ఆ బాధలో పనిపై శ్రద్ధ పెట్టలేకపోతున్నానని మెయిల్ చేశాడనీ తనకు కొన్ని రోజులు సెలవు కావాలని కోరాడనీ తెలిపారు. జెన్‌ జెడ్‌ తరం ఉద్యోగులు తమ మనసులో ఏమీ దాచుకోరని జస్వీర్‌ సింగ్‌ మెచ్చుకున్నారు. తమ భావోద్వేగాలు, మానసిక సమస్యలు వంటి అన్ని విషయాలను బహిరంగంగా పంచుకుంటారని చెప్పారు. ఈ పోస్టుకు నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. ఇంతకీ ఆ ఉద్యోగికి సెలవు ఇచ్చారా లేదా అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. జస్వీర్ సింగ్ స్పందించారు. మెయిల్ చదివిన మరుక్షణమే లీవ్ మంజూరు చేశానని బదులిచ్చారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రీల్‌ స్టోరీ కాదు.. రియల్‌ కహానీ.. ముంబైలో గుట్టుగా రెండో కాపురం పెట్టాడు.. ఆ తరువాత

ఇందిరమ్మ ఇల్లు లబ్దిదారుడిని.. చెట్టుకు కట్టేసిన కాంట్రాక్టర్‌

గుడికి వెళ్లి వస్తుంటే.. రోడ్డుపై దొరికిన డబ్బు సంచి..

‘అజ్మల్ అమ్మాయిలను వేధిస్తాడు.. నన్ను కూడా ..’ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

శిరీష్‌ ఎంగేజ్‌మెంట్‌పై వర్షం దెబ్బ.. ఆగమైన ఏర్పాట్లు..! శిరీష్‌ ఎమోషనల్