నిమ్మరసానికి ‘గ్యాస్ ఛార్జ్’.. బిల్లు చూసి కస్టమర్ షాక్ !!

Updated on: Mar 20, 2026 | 5:31 PM

బెంగళూరులోని ఓ కేఫ్‌ గ్యాస్‌ సంక్షోభం పేరుతో నిమ్మరసం బిల్లుపై 5% అదనపు ఛార్జీ వసూలు చేసింది. వంటకు సంబంధం లేని డ్రింక్‌పై ఈ ఛార్జీ వసూలు చేయడంతో బిల్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది వినియోగదారుల హక్కుల ఉల్లంఘనగా భావించిన ప్రభుత్వం, సదరు కేఫ్‌కు నోటీసులు జారీ చేసింది. గ్యాస్ కొరతను సాకుగా చూపి దోపిడీకి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

గ్యాస్‌ క్రైసిస్‌ను ఆసరాగా చేసుకొని హోటల్‌ నిర్వాహకులు కస్టమర్స్‌ను తమదైనశైలిలో దోచుకునే పనిలో పడ్డారా అంటే అవుననే అనిపిస్తుంది. సాధారణంగా హోటల్‌కు వెళ్లి కాఫీ తాగడమో, టిఫిన్‌ తినడమో చేస్తే వంట గ్యాస్ ఖర్చవుతుంది, కాబట్టి బిల్లులో గ్యాస్‌ చార్జీ వేసారంటే ఓ అర్థం ఉంటుంది. కానీ, కేవలం రెండు గ్లాసుల నిమ్మరసం తాగితే.. దానికి కూడా ‘గ్యాస్ సంక్షోభం’ పేరుతో అదనపు బాదుడు బాదితే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇలాంటి వింత అనుభవమే బెంగళూరులోని ఒక కేఫ్‌కు వెళ్లిన కస్టమర్లకు ఎదురైంది. ప్రస్తుతం ఈ బిల్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కర్ణాటకలో ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ల కొరత వేధిస్తోంది. దీనిని సాకుగా చూపిస్తూ బెంగళూరులోని ఒక ప్రముఖ కేఫ్, కస్టమర్ల బిల్లుపై ఏకంగా 5 శాతం ‘గ్యాస్ క్రైసిస్ ఛార్జ్’ పేరుతో అదనపు వసూళ్లకు తెరలేపింది. ఆదివారం ఇద్దరు కస్టమర్లు ఆ కేఫ్‌లో నిమ్మరసం తాగారు. దాని ధర రూ. 374 కాగా, వంటతో సంబంధం లేని ఈ డ్రింక్‌పై కూడా రూ. 17.01 గ్యాస్ ఛార్జీగా వేశారు. నిమ్మరసం చేయడానికి గ్యాస్ ఎందుకు వాడతారు? ఇది మరీ దారుణం అంటూ నెటిజన్లు సదరు హోటల్ యాజమాన్యంపై మండిపడుతున్నారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వం వెంటనే స్పందించింది. వినియోగదారుల హక్కుల ఉల్లంఘన కింద రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ ఆ హోటల్‌కు నోటీసులు జారీ చేసింది. గ్యాస్ కొరతను సాకుగా చూపి సామాన్యులను దోచుకుంటే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏం చేస్తాం.. నేను కష్టపడి కట్టుకున్న ఇల్లు సుడిగాలి సుధీర్ వశమైంది

వరల్డ్‌ కప్‌కు సెలక్ట్ చేయలేదనే కోపంతో సినిమాల్లోకి.. కట్ చేస్తే స్టార్ డైరెక్టర్‌గా..

వాటి మీద ఆసక్తితో.. భారీగా డబ్బును చేజార్చుకున్నాడు.. అయితే..

Loading...
Unable to load recommendations.
Follow Us