మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే.. ఏం చేశారంటే

Updated on: Feb 11, 2026 | 12:24 PM

గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆపదలో ఉన్న ప్రజలకు అండగా నిలిచారు. కొండవీడు నుండి తిరిగి వస్తుండగా, రోడ్డు ప్రమాదంలో గాయపడిన ముగ్గురిని తన కాన్వాయ్ ఆపి, ప్రథమ చికిత్స అందించారు. ఆలస్యం చేయకుండా తన సొంత వాహనంలోనే వారిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, మెరుగైన వైద్యం అందేలా చూశారు. ఆమె సేవా గుణాన్ని ప్రజలు ప్రశంసిస్తున్నారు.

ప్రజా ప్రతినిధులు అంటే కేవలం పాలనకే పరిమితం కాకుండా, ఆపదలో ఉన్న ప్రజలకు అండగా నిలవాలని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి మరోసారి నిరూపించారు. ఆదివారం కొండవీడు ఉత్సవాలకు హాజరై తిరిగి వస్తున్న సమయంలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం ఆమెలోని సేవా గుణాన్ని చాటిచెప్పింది. ఫిరంగిపురం – కొండవీడు మధ్య రహదారిపై ప్రయాణిస్తున్న సమయంలో, ఒక ద్విచక్ర వాహనం ప్రమాదానికి గురై ముగ్గురు వ్యక్తులు తీవ్ర గాయాలతో రోడ్డుపై పడి ఉండటాన్ని ఎమ్మెల్యే గమనించారు. వాహనాల రద్దీ ఉన్నప్పటికీ, ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన కాన్వాయ్‌ను నిలిపివేసి బాధితుల వద్దకు వెళ్లారు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న క్షతగాత్రులకు అక్కడికక్కడే ప్రథమ చికిత్స అందేలా చూశారు. అంబులెన్స్ కోసం వేచి చూడకుండా, సమయం వృథా కాకూడదనే ఉద్దేశంతో గాయపడిన వారిని తన సొంత వాహనంలోనే గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరుకున్నాక బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందేలా వైద్యులతో స్వయంగా మాట్లాడి పర్యవేక్షించారు. ఆపదలో ఉన్న తమను ఏమాత్రం పరిచయం లేకపోయినా ఆదుకున్న ఎమ్మెల్యేకు బాధితులు, వారి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతూ కృతజ్ఞతలు తెలిపారు. ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఇలా సామాన్యుల ప్రాణాలు కాపాడటం కోసం శ్రమించడం పట్ల స్థానికులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీళ్లు తాగుతున్నారా.. జాగ్రత్త

కష్టపడి రాళ్లతో పగలగొట్టాడు.. అంతలోనే..

రాత్రి తలుపు తట్టిన శబ్దం.. వణికిపోతున్న ఊళ్లు.. ఎందుకిలా

బంగారం కొంటున్నారా.. ? మీ కొంప కొల్లేరే

CM Chandrababu Naidu: ఢిల్లీలో.. ఏపీ సీఎం చంద్రబాబు బిజీ బిజీ

Loading...
Unable to load recommendations.
Follow Us