కళ్లు చెదిరేలా క్యాబ్ డ్రైవర్ సంపాదన..? వైరల్ డ్రైవర్ కథ
కార్పొరేట్ ఉద్యోగంలో నెలకు రూ.25 వేలు సంపాదించిన ఓ వ్యక్తి, ఆ ఉద్యోగాన్ని వదిలి క్యాబ్ డ్రైవర్‌గా మారి ఇప్పుడు నెలకు రూ.1 లక్ష వరకు సంపాదిస్తున్నట్లు తెలిపాడు. జిప్ ఎలక్ట్రిక్ సీఈఓ ఆకాష్ గుప్తా ఈ కథను సోషల్ మీడియాలో పంచుకోవడంతో గిగ్ వర్కర్ల పాత్ర, స్వయం ఉపాధి అవకాశాలపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది.
ఒక స్టార్టప్ ఫౌండర్ పోస్ట్ నెట్టింట సందడి చేసింది. దేశంలో నిరుద్యోగుల పైనా గిగ్ వర్కర్లపైనా చర్చకు దారితీసింది. ‘జిప్ ఎలక్ట్రిక్’ సీఈఓ ఆకాష్ గుప్తా తను ప్రయాణించిన క్యాబ్ డ్రైవర్‌తో ఆసక్తికర సంభాషణను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో వీడియో వైరల్‌గా మారింది. క్యాబ్ డ్రైవర్ గతంలో ఒక కార్పొరేట్ ఆఫీస్ లో ఉద్యోగం చేస్తూ నెలకు పాతికవేలు సంపాదించేవాడట. అది ఏ మూలకు రాకపోవడంతో ఆ ఉద్యోగాన్ని వదిలేసి క్యాబ్ డ్రైవర్‌గా మారాడు. ఫలితంగా ఇప్పుడు నెలకు రూ.1 లక్ష వరకు సంపాదిస్తున్నాడు. అలాగే తను చేసే పని మీద తనకు పూర్తి నియంత్రణ ఉందని ఆనందం వ్యక్తం చేశాడు. ఎప్పుడు, ఎక్కడ, ఎంత పని చేయాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ తన జీవితాన్ని మార్చేసిందన్నాడు. రోజుకు 10 గంటలు పనిచేస్తూ రూ.3 నుంచి రూ.4 వేల వరకు సంపాదిస్తున్నాడని చెప్పాడు. ఈ పరిణామాన్ని ఆకాష్ గుప్తా భారత సరికొత్త మధ్యతరగతికి ఉదాహరణగా అభివర్ణించారు. సొంతంగా వాహనాన్ని, సమయాన్ని మేనేజ్ చేసుకుంటూ సంపాదిస్తున్నందున, ఇకపై ఎవరికైనా పరిచయం చేసుకునేటప్పుడు తనను తాను ఒక బిజినెస్‌మ్యాన్‌గా చెప్పుకోవాలని డ్రైవర్‌కు సూచించారు. గిగ్ వర్కర్లు కేవలం డెలివరీ పార్టనర్లు మాత్రమే కాదు, ఇష్టపూర్వకంగా పనిచేస్తూ ఆదాయాన్ని సృష్టించుకునే మైక్రో-ఎంట్రప్రెన్యూర్స్ అని… వీరే తర్వాతి మధ్యతరగతి వర్గం అని గుప్తా తన పోస్ట్‌లో చెప్పుకొచ్చారు. గిగ్ వర్కర్లను గౌరవించాలి అంటూ నెటిజన్లు ఈ పోస్ట్‌పై స్పందించారు. అతని స్టోరీ ఎంతో స్ఫూర్తిదాయకమని మరొకరు అన్నారు. గతంలో ఉద్యోగం ద్వారా నెలకు రూ. 70 వేలు సంపాదించే తాను, ఇపుడా ఉద్యోగం వదిలేసి కార్ డ్రైవ్ చేస్తూ ఉద్యోగం కంటే ఎక్కువే సంపాదిస్తున్నాననీ ఒత్తిళ్ల నుంచి దూరంగా హ్యాపీగా ఉన్నాను అంటూ మరొకరు తన అనుభవాన్ని పంచుకున్నారు. జిప్ ఎలక్ట్రిక్ వ్యవస్థాపకుడైన ఆకాష్ గుప్తా, ఆన్‌లైన్‌లో కంటెంట్ క్రియేటర్‌గా కూడా గుర్తింపు పొందారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సూరత్ మహిళ వింత దొంగతనం.. యజమాని షాక్!
ఉద్యోగులకు సీఈవో వింత గిఫ్ట్! ఒక్కొక్కరికీ రూ. 2.6 లక్షల పరుపు
