మనిషివేనా నువ్వసలు.. కస్టమర్ పై డెలివరీ బాయ్ చిందులు.. కారణం ఇదే

|

Nov 05, 2024 | 8:17 PM

దీపావళి రోజు ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్న వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది. ఓటీపీ చెప్పి పార్సిల్ తీసుకున్న వెంటనే డెలివరీ బాయ్ ప్రవర్తన అతడిని అవాక్కయ్యేలా చేసింది. మీరు చేస్తున్నది తప్పు భయ్యా అంటూ డెలివరీ బాయ్ అనడంతో అతడి ముఖానికేసి షాక్ తో చూశాడు. ఏంటి తప్పు ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడమా?.. అనడిగితే.. కాదు కాదు దీపావళి రోజు ఎవరైనా చికెన్ తింటారా? అంటూ ఎదురు ప్రశ్నించాడు.

అతడు వేసిన ప్రశ్నకు ఏం చెప్పాలో తెలీక నిర్ఘాంతపోయానని ఢిల్లీకి చెందిన సదరు ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ కస్టమర్ వాపోయాడు. ఈ పండగ రోజులు ఎంతో పవిత్రమైనవని తాము నమ్ముతామని.. తమ మత సంప్రదాయం ప్రకారం అలాంటి రోజుల్లో నాన్ వెజ్ తినడం చాలా తప్పని లెక్చర్ ఇచ్చాడు. అక్కడితో ఆగకుండా ఇలా చేయడం ఎంత పెద్ద పాపమో వివరించి వెళ్లాడు. తనకు ఎదురైన అనుభవాన్ని అతడు సోషల్ మీడియాలో పంచుకోవడంతో వైరల్ గా మారింది. ఇలాంటి ప్రవర్తన మితిమీరితే చాలా నష్టం. అతడిపై కంప్లైంట్ చేయండి. ఇంకోసారి మీ పరిసరాల్లోకి డెలివరీ చేయకుండా జాగ్రత్త పడండి అంటూ నెటిజన్లు అతడి పోస్ట్ పై స్పందిస్తున్నారు. అతడి నమ్మకాన్ని మీపై రుద్దాల్సిన అవసరం లేదు. దానికి బదులు పండగ పూట చికెన్ డెలివరీ చేయనని అతడు చెప్పాల్సింది అని మరో వ్యక్తి స్పందించాడు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నీతా అంబానీకి 60 ఏళ్లు.. ఆమె కనుసన్నల్లో ఓ పెద్ద సామ్రాజ్యమే నడుస్తుంది !!

శుభలేఖ రూ.11 లక్షలు !! ఈ ఖర్చుతో 2 పెళ్లిళ్లు చెయ్యచ్చు

రైల్లో టాయిలెట్‌ బాగోలేదా ?? కేసు పెట్టండి.. పరిహారం పొందండి

ఇల్లు శుభ్రం చేస్తుండగా మహిళకు దొరికిన ప్లాస్టిక్‌ కవర్‌.. అందులోఉన్నది చూసి షాక్‌ !!

Vettaiyan OTT: ఓటీటీలోకి వేట్టయాన్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పట్నుంచి అంటే !!