యాక్టింగ్ సూపర్ క్వీన్.. జైలులో రిమాండ్ మహిళా ఖైదీ హైడ్రామా

|

Jun 19, 2024 | 11:22 PM

భర్త దారుణ హత్య కేసులో‌ ఏ 1 నిందితురాలుగా జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఓ నిందితురాలు జైలు నుండి బయటపడేందుకు సూపర్ క్వీన్ యాక్టింగ్ ప్రదర్శించింది. ఆత్మహత్య ప్రయత్నం చేశానని.. ప్రాణాలు పోతున్నాయంటూ గొంతు పట్టుకుని కేకలు వేసింది. నిజమేనని నమ్మిన జిల్లా జైలు సిబ్బంది నిందితురాలి ప్రాణాలు కాపాడేందుకు హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి‌ తరలించారు. పరీక్షించిన వైద్యులు నిందితురాలు ఆరోగ్యంగానే ఉందని ఎలాంటి ప్రమాదం లేదని తేల్చడంతో ఊపిరి పీల్చుకున్నారు.

భర్త దారుణ హత్య కేసులో‌ ఏ 1 నిందితురాలుగా జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఓ నిందితురాలు జైలు నుండి బయటపడేందుకు సూపర్ క్వీన్ యాక్టింగ్ ప్రదర్శించింది. ఆత్మహత్య ప్రయత్నం చేశానని.. ప్రాణాలు పోతున్నాయంటూ గొంతు పట్టుకుని కేకలు వేసింది. నిజమేనని నమ్మిన జిల్లా జైలు సిబ్బంది నిందితురాలి ప్రాణాలు కాపాడేందుకు హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి‌ తరలించారు. పరీక్షించిన వైద్యులు నిందితురాలు ఆరోగ్యంగానే ఉందని ఎలాంటి ప్రమాదం లేదని తేల్చడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆత్మహత్య యత్నం అంతా ఉత్తిదే అని‌ గుర్తించిన జైలు సిబ్బంది నిందితురాలిని తిరిగి జైలుకు తరలించారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా జైల్ లో చోటు చేసుకుంది. ఈ నెల 12 న ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం అర్జుని , లోకారి శివారు అటవి ప్రాంతంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు గజేందర్ దారుణ హత్యకు గురయ్యాడు. 24 గంటల్లోనే కేసును చేదించి‌న పోలీసులు.. గజేందర్ హత్యకు కర్త కర్మ క్రియ భార్య విజయలక్ష్మి అని తేల్చారు. ప్రియుడి మాయలో పడి.. ఆరు లక్షల సుపారీ ఇచ్చి మరి భర్తను దారుణంగా హత్య చేయించిందని గుర్తించి అరెస్ట్ చేశారు పోలీసులు. ఈనెల 15 న అరెస్ట్ చేసి ఆదిలాబాద్ జిల్లా జైలుకు రిమాండ్ కు తరలించారు. ఆదిలాబాద్ జిల్లా జైలులో రెండు రోజులు రిమాండ్ ఖైదీగా గడిపిన విజయలక్ష్మి సూపర్ యాక్టింగ్ తో జిల్లా జైలు సిబ్బందిని బోల్తా కొట్టించే ప్రయత్నం చేసింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బైకును ఢీకొట్టి ఎగిరిపడ్డ ఆటో డ్రైవర్‌.. ఆ తర్వాత..

భార్య కంట్లో పడ్డ భర్త నిర్వాకం.. ఏం చేశాడో తెలుసా ??

Follow us on