Brazil : ప్రాణం తీసిన బంగీజంప్.. ఏం జరిగిందంటే..
బ్రెజిల్‌లో జరిగిన విషాదకర ఘటన అడ్వెంచర్ స్పోర్ట్స్‌లో భద్రత ఎంత ముఖ్యమో మరోసారి గుర్తు చేసింది. బంగీ జంప్ కోసం వెళ్లిన యువతి మరియా రోడ్రిగ్స్‌కు నిర్వాహకులు సేఫ్టీ తాడు కట్టడం మర్చిపోవడంతో ఆమె 130 అడుగుల ఎత్తు నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై పోలీసులు చర్యలు తీసుకుని పలువురిని అరెస్ట్ చేశారు.
అడ్వెంచర్ స్పోర్ట్స్ ఎంత థ్రిల్‌ను ఇస్తాయో, చిన్న పొరపాటు జరిగితే అంతటి ఘోర విషాదాన్ని మిగులుస్తాయని బ్రెజిల్‌లో జరిగిన ఒక హృదయవిదారక ఘటన నిరూపించింది. సాహసం చేయాలనే ఉత్సాహంతో వెళ్లిన ఒక యువతి, నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోయింది. బ్రెజిల్‌లోని సావోపాలో రాష్ట్రం లిమేరా ప్రాంతంలో ఉన్న ‘పోంటే డో ఎస్కెలెటో’ బ్రిడ్జి సాహస క్రీడలకు అత్యంత ప్రసిద్ధి చెందినది. ఇక్కడికి తన స్నేహితులతో కలిసి వచ్చిన మరియా రోడ్రిగ్స్ అనే యువతి బంగీ జంప్ చేయడానికి సిద్ధమైంది. జంపింగ్ పాయింట్ దగ్గరకు రాగానే నిర్వాహకులు ఆమెకు హెల్మెట్ తొడిగారు, చేయాల్సిన సూచనలన్నీ క్లియర్‌గా వివరించారు. అంతా సవ్యంగానే ఉందనుకుని మరియా వారిని పూర్తిగా నమ్మింది. కానీ, అసలైన భద్రతా ప్రమాణాన్నే నిర్వాహకులు గాలికొదిలేశారు. తాళం వేసి గొళ్లెం మరిచిపోయినట్లు.. ఆమె కాళ్లకు సురక్షితమైన తాడును కట్టడం మర్చిపోయారు. ఆ తర్వాత సుమారు 130 అడుగుల ఎత్తు నుంచి ఆమెను కిందకు తోసేశారు. తాడు కట్టలేదనే విషయం గమనించేలోపే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. లోయలో పడి తీవ్ర గాయాలతో మరియా అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ప్రమాదం జరిగిన వెంటనే భయంతో నిర్వాహకుల్లో ఇద్దరు పక్కనే ఉన్న అడవిలోకి పారిపోగా, పోలీసులు హెలికాప్టర్ సహాయంతో గాలించి వారిని అదుపులోకి తీసుకున్నారు. నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని గుర్తించి మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన అడ్వెంచర్ ప్రియులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అల్లు అర్జున్ ఎఫెక్ట్.. AA23 థీమ్ మ్యూజిక్‌ను ఉపయోగించిన.. ప్రధాని నరేంద్ర మోడి
ఈ వారం ఓటీటీల్లో 14 సినిమాలు.. ఆ మూవీని మాత్రం డోంట్ మిస్!
మన హీరోలకు బేసిక్ సినిమా నాలెడ్జ్ లేదు
సినిమాల తర్వాత ప్రజాసేవే లక్ష్యం.. రాజకీయాల్లోకి మరో తమిళ స్టార్
