Viral Video: శ్వేతవర్ణంలో దగదగ మెరిసిపోతున్న కొండచిలువ.. ఇలాంటిది మీరెప్పుడైనా చూశారా..?
రేర్.. చాలా అంటే చాలా రేర్. కర్ణాటకలో 9 అడుగుల అందరి దృష్టిని ఆకర్షించింది. ఇలాంటి కొండచిలువలు పుట్టిన తరవాత ఎక్కువకాలం బతకడం కష్టమని స్నేక్ క్యాచర్ తెలిపాడు. దాన్ని జాగ్రత్తగా బంధించి.. అటవీ అధికారులకు అప్పగించాడు. ఈ కొండచిలువ తొమ్మిది అడుగుల పొడవు ఉంది. దాని వయస్సు సుమారు 8 సంవత్సరాలు ఉండిచ్చట. కానీ ఇలాంటి వన్యప్రాణులు కనిపిస్తే.. తమకు సమాచారమివ్వాలని ఫారెస్ట్ సిబ్బంది సూచిస్తున్నారు.
కొండచిలువ మాములుగా గోధుమ, బూడిద రంగులో నలుపు చారలతో కనిపిస్తుంది. ఇప్పటివరకు మనకు తారసపడ్డవన్నీ ఇంచుమించుగా ఇలానే ఉంటాయి. అయితే కర్నాటకలో కనిపించిన ఓ 9 అడుగుల కొండచిలువ అందరి దృష్టిని ఆకర్షించింది. అందుకు కారణం దాని కలర్. ఇది స్వచ్చమైన తెల్ల రంగులో మెరుసిపోతూ ఉంది. ఉత్తర కన్నడ జిల్లలోని కుంమ్టా తాలుకా హేగ్దే గ్రామంలో ఈ అరుదైన సర్పం కనిపించింది. గ్రామానికి చెందిన దేవి నారాయణ్ ముక్రీ.. నివాసంలో దీన్ని గుర్తించారు. దీంతో వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారమిచ్చారు. అతడు వచ్చి దాన్ని చాకచక్యంగా బంధించాడు. పిగ్మెంట్ లోపించడం కొండచిలువలు ఇలా తెల్లగా మారతాయని స్నేక్ క్యాచర్ పవన్ నాయక్ వెల్లడించాడు. ఇదే గ్రామంలో గతంలో సైతం అలాంటి కొండచిలువ కనిపించిందని తెలిపాడు.
కాగా ఇలాంటి అరుదైన కొండచిలువలు ఎక్కువ కాలం బ్రతకడం కష్టమని.. ఇవి కనిపించగానే ఇతర జంతువులు అటాక్ చేస్తాయని పవన్ నాయక్ తెలిపాడు. ప్రస్తుతం బంధించిన కొండచిలువకు 8 ఏళ్ల వయసు ఉంటుందని చెప్పాడు. ఆపై ఆ పైథాన్‌ను కుమట ఫారెస్ట్ సిబ్బందికి అప్పగించాడు. వారు దాన్ని మైసూరు జూకు తరలించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..