క్షణ క్షణం.. భయం భయం.. అసలు అక్కడ ఏం జరుగుతోంది ??

Updated on: May 03, 2025 | 9:22 AM

పార్వతీపురం మన్యం జిల్లాలో గత కొన్ని రోజులుగా ఓ ఏనుగుల గుంపు హల్చల్‌ చేస్తోంది. రోడ్లపైకి వచ్చి వాహనదారులను భయాందోళనకు గురిచేస్తోంది. గజరాజులు సృష్టిస్తున్న బీభత్సం పలు మండలాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కురుపాం, జియ్యమ్మవలస, గుమ్మలక్ష్మీపురం, గరుగుబిల్లి, పార్వతీపురం మండలాల్లో ఏనుగులు స్వైర విహారం చేస్తున్నాయి.

పగలు, రాత్రి తేడా లేకుండా సంచరిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. గత మూడు రోజులుగా ఏనుగులు మరింత రెచ్చిపోతున్నాయి. గరుగుబిల్లి మండలం నందివానివలసలో అర్ధరాత్రి పెద్ద ఎత్తున ఘీంకారాలు చేస్తూ గ్రామంలో సంచరించాయి. తెల్లవారుజామున గ్రామంలో ఉన్న మోడరన్ రైస్ మిల్లు లోకి చొరబడ్డాయి. అక్కడ నిల్వ ఉన్న ధాన్యాన్ని చెల్లాచెదురు చేశాయి. అంతటితో ఆగకుండా మిల్లులోని ఫర్నీచర్ మొత్తాన్ని ధ్వంసం చేశాయి. అర్ధరాత్రి ఏనుగులు చేసిన వీరంగంతో గ్రామస్తులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. చీకటి పడితే ఏం జరుగుతుందోనని.. ఎటువైపు నుంచి ఏనుగుల గుంపు ఇంటిపైకి దాడికి వస్తాయోనని స్థానికులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తరుచూ తలనొప్పి పరేషాన్ చేస్తోందా ?? ఈ పని చేయండి ఇట్టే పోతుంది..!

ఎండాకాలమని మెట్రో రైల్లో ప్రయాణిస్తున్నారా ??

చికెన్‌ ప్రియులకు బ్యాడ్‌ న్యూస్‌.. అతిగా తింటున్నారా ?? అయితే మీకు

మరదలితో లేచిపోయిన ముగ్గురు పిల్లల వదిన

విమానానికి హ్యాండ్ పంప్‌తో గాలి కొట్టిన పైలట్