72 ఏళ్ల వయసులో క్లాస్‌రూమ్‌లో సెకండ్‌ ఇన్నింగ్స్‌

Updated on: Sep 04, 2025 | 7:08 PM

ప్రస్తుతం యువతకు ఏదైనా ఈజీగా దొరికిపోవాలి. కష్టం విలువ తెలియడం లేదు. పుస్తకాలు కొనిచ్చి, ఫీజులు కట్టి, బైక్‌ ఇచ్చి దానిలో పెట్రోల్‌ కూడా పోసి బుద్దిగా కాలేజీకి వెళ్లి చదువుకోరా అంటే బాబులకు బద్దకం. అలాంటి వ్యక్తులకు ఈ పెద్దాయన ఓ గుణపాఠం. బొగ్గు గని కార్మికుడిగా ఉద్యోగం నుంచి రిటైర్‌ అయిన ఓ వ్యక్తి.. 72 ఏళ్ల వయసులో విద్యార్థిగా మారారు.

పదవీ విరమణ పొంది 10 ఏళ్లైనా చదవాలన్న ఉత్సుకతతో విద్యార్థిగా సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించారు. తమిళనాడులోని కడలూర్‌ జిల్లా వడలూర్‌కు చెందిన సెల్వమణి నేషనల్‌ లిగ్నైట్‌ కార్పొరేషన్‌ బొగ్గు గనిలో 37 ఏళ్లుగా కార్మికుడిగా పని చేసి పదవీ విరమణ పొందారు. ఎంకామ్, ఎంబీఏ, ఐటీఐ పూర్తి చేసిన ఆయనకు ఇద్దరు కుమారులున్నారు. ఇంకా చదువుకోవాలనే ఆసక్తి ఉండటంతో మైలాడుదురై జిల్లా సీర్గాళిలోని శ్రీనివాస సుబ్బరాయ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో డిప్లొమా ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ కోర్సులో చేరారు. ఇంటి పనుల్లో భార్యకు సాయం చేస్తూ, క్రమం తప్పకుండా తరగతులకు హాజరవుతున్నారు. తన మనవళ్లంతా వయసు ఉన్న పిల్లలతో కలిసి బెంచ్‌ పంచుకుంటున్నారు. టీచర్లు చెప్పేది శ్రద్దంగా వింటున్నారు. క్లాస్‌ వర్క్‌ నోట్‌ చేసుకుని హోంవర్క్‌ క్రమం తప్పకుండా అప్పగిస్తున్నారు. ఇది చూసిన స్టూడెంట్ష్‌ ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు 72 ఏళ్ల వయసులో మళ్లీ చదువుకోవాలనే ఉత్సాహం కలగడం పట్ల సెల్వమణిని స్థానికులు అభినందిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ ఐఏఎస్‌కి.. ఫాలోయింగ్‌ ఎక్కువ గురు.. కారణం

మహిళలకు శుభవార్త.. ప్రతి ఒక్కరికి రూ.10 వేలు..

భూమిపైకి దూసుకొస్తున్న ఏలియన్స్ వ్యోమనౌక? నవంబర్‌లో ఏం జరగబోతుంది?

నటి రన్యారావుకు రూ.102 కోట్ల జరిమానా

బ్యాంక్ జాబ్ కు రిజైన్.. యువతి పోస్ట్‌ వైరల్‌