పాకిస్థాన్‌లో పెట్రో మంటలు.. లీటరు ఎంతో తెలుసా?

Updated on: Apr 04, 2026 | 9:37 AM

ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌ ప్రజలపై ఆ దేశ ప్రభుత్వం పెట్రో బాంబు పేల్చింది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం, పశ్చిమాసియాలో ఉద్రిక్తతల సాకుతో పెట్రోల్, డీజిల్ ధరలను రికార్డు స్థాయిలో పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. పెంచిన ధరలు ఏప్రిల్ 3 శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చాయి.

తాజా పెంపుతో ఇంధన ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరాయి. హై-స్పీడ్ డీజిల్ లీటర్‌పై ఏకంగా రూ. 184.49 అంటే 54 శాతం పైగా పెరగడంతో, ప్రస్తుతం దీని ధర రూ.520.35కు చేరింది. పెట్రోల్ లీటర్‌పై రూ. 137.23 అంటే 42 శాతం పైగా అదనపు భారం పడటంతో, దీని ధర రూ. 458.40కు ఎగబాకింది. కేవలం నెల రోజుల వ్యవధిలోనే ధరలు పెరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు పెరగడం వల్లే ఈ భారాన్ని ప్రజలపై వేయక తప్పలేదని ఆర్థిక మంత్రి మహమ్మద్ ఔరంగజేబ్ స్పష్టం చేశారు. అయితే, బలహీన వర్గాలకు ఊరటనిచ్చేలా కొన్ని సబ్సిడీలను ప్రభుత్వం ప్రకటించింది. ద్విచక్ర వాహనదారులకు నెలకు 20 లీటర్ల వరకు, లీటర్‌కు రూ. 100 సబ్సిడీని మూడు నెలల పాటు అందించనున్నారు. చిన్న రైతులు, ప్రజా రవాణా వాహనదారులకు కూడా ప్రత్యేక రాయితీలు ప్రకటించారు. ఇప్పటికే ద్రవ్యోల్బణంతో అల్లాడుతున్న పాక్ ప్రజలకు, ఈ ఇంధన ధరల పెంపు మరిన్ని కష్టాలను తెచ్చిపెట్టనుంది. నిత్యావసర ధరలు కూడా పెరిగే అవకాశం ఉండటంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

మరిన్ని వీడియోల కోసం :

బాబోయ్‌.. గుడిలో పాములు..భక్తుల పరుగులు!

పొలం చదును చేస్తుండగా బరువుగా తగిలిన కుండ..లోపల చూడగా కళ్లు జిగేల్‌!

గ్రామంలో వింత తీర్మానం.. పోలీసుల పిలుపుతో మారిన సీన్‌

రండి.. నరికి సొరచేపలకు వేస్తాం.. అమెరికా సైనికులకు ఇరాన్‌ కవ్వింపు

Follow Us