Viral Video: విమానంలో మ‌హిళా ప్ర‌యాణికురాలిపై మూత్రం.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..

Viral Video: విమానంలో మ‌హిళా ప్ర‌యాణికురాలిపై మూత్రం.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..

Anil kumar poka

|

Updated on: Jan 14, 2023 | 9:34 AM

ఎయిర్ ఇండియా విమానంలోని బిజినెస్ క్లాస్‌లో ప్ర‌యాణిస్తున్న ఓ మ‌హిళ‌పై తాగిన మ‌త్తులో ఉన్న ఓ వ్య‌క్తి మూత్రం పోశాడు. ఈ ఘ‌ట‌న అమెరికాలోని జాన్


ఎయిర్ ఇండియా విమానంలోని బిజినెస్ క్లాస్‌లో ప్ర‌యాణిస్తున్న ఓ మ‌హిళ‌పై తాగిన మ‌త్తులో ఉన్న ఓ వ్య‌క్తి మూత్రం పోశాడు. అమెరికాలోని జాన్ ఎఫ్ కెన్న‌డీ విమానాశ్ర‌యం నుంచి ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీకి వ‌స్తున్న సంద‌ర్భంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులకి ఫిర్యాదు ఇచ్చింది ఎయిర్ ఇండియా.నిజానికి ఆ వ్య‌క్తిపై చ‌ర్య‌ తీసుకోవాల‌ని మ‌హిళా ప్యాసింజెర్‌ విమానంలోని క్యాబిన్ సిబ్బందికి చెప్పినా వారు ప‌ట్టించుకోలేదు. దీంతో ఆమె టాటా సంస్థ చైర్మ‌న్ చంద్ర‌శేఖ‌ర‌న్‌కు లేఖ రాశారు. ఆ త‌ర్వాతే ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ మొద‌లుపెట్టారని ఆమె అన్నారు.భోజ‌నం త‌ర్వాత లైట్లను డిమ్ చేసిన స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ప్యాసింజెర్ మూత్రం పోయ‌డం వ‌ల్ల త‌న దుస్తులు, బ్యాగ్, షూ త‌డిసిన‌ట్లు ఆమె ఆరోపించారు. విమానం సిబ్బంది త‌న‌కు దుస్తుల్ని, చెప్పుల‌ను ఇచ్చిన‌ట్లు ఆమె తెలిపారు. ఫ‌స్ట్ క్లాస్‌లో చాలా సీట్లు ఖాళీగా ఉన్నా.. స్టాఫ్‌ సీటులో ప్ర‌యాణించాల్సి వ‌చ్చింద‌ని ఆమె చెప్పారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Chiranjeevi – Pawan Kalyan: వైసీపీతో పవన్ పోరాటం చేస్తే నాకేంటి సంబంధం.. చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ ..

Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..

Love couples: శృతిమించుతున్న యువతీ యువకులు జల్సాలు.. బైక్‌పై ప్రేమజంట వెకిలిచేష్టలు.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Published on: Jan 14, 2023 09:34 AM