మందేసి.. దోసె తింటే మీ పని మటాష్ !! ఇప్పటికైనా జాగ్రత్తపడండి
చావు, పుట్టుకలు మన చేతుల్లో ఉండవు. మృత్యువు సమీపించే టైమ్‌ను ఎవరూ ఆపలేరు. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా, నాకేం అవుతుందిలే అని నిర్లక్ష్యంగా ఉన్నా చావు దగ్గరైతే తప్పించుకోలేరంటారు. నాగర్ కర్నూల్ జిల్లాలో అలాంటి ఓ ఘటనే జరిగింది. మందు తాగేటప్పుడు కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటే అసౌకర్యం కలిగే అవకాశాలు ఉంటాయి. అవి జీర్ణక్రియలో సమస్యలు కలిగించవచ్చు లేదా మద్యం ప్రభావాన్ని పెంచవచ్చు.
మంచింగ్ కోసం ఉప్పు ఎక్కువగా ఉన్న చిప్స్ తీసుకోవడం వల్ల దాహం పెరుగుతుంది . డీహైడ్రేషన్ అధికం అవుతుంది, ఇది మద్యం ప్రభావాన్ని ఎక్కువగా చేసి తలనొప్పిని కలిగిస్తుంది. అధిక మసాలా కలిగిన ఆహారాలు తినడం వల్ల కూడా , మద్యం తాగేటప్పుడు కడుపు మంట లేదా ఆమ్లత్వం ఎక్కువ కావచ్చు. చీజ్, పాలు, , క్రీమ్ వంటి అధిక కొవ్వు కలిగిన పదార్థాలు జీర్ణక్రియను మందగిస్తాయి. మద్యం తాగినప్పుడు ఇవి మరింత అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా పేగు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతుంటారు. అయితే ఉదయం అల్పాహారంగా దోశ తిన్న ఓ వ్యక్తి ఊపిరాడక ఇబ్బందిపడ్డాడు. దోశ ముక్క గొంతులో అడ్డుపడి అష్టకష్టాలూ పడ్డాడు. అసలేం జరిగిందంటే.. నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణ కేంద్రంలోని సుభాష్ నగర్లో వెంకటయ్య అనే 43 ఏళ్ల వ్యక్తి ఇంట్లో ఉదయం అల్పాహారంగా దోశలు తింటున్నాడు. దోశను ఒక్కసారే మింగే ప్రయత్నం చేయగా అది ఇరుక్కుపోయింది. దీంతో వెంకటయ్యకు ఒక్కసారిగా ఊపిరి ఆగిపోయినట్లు అయింది. గాలి పీల్చుకోవడం కష్టంకావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే కుటుంబ సభ్యులు, స్థానికులతో కలిసి ఎంత ప్రయత్నించినా వెంకటయ్యకు ఊపిరి అందలేదు. హుటాహుటిన హాస్పిటల్కి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే వెంకటయ్య మరణించినట్లు ప్రకటించారు. వెంకటయ్య అప్పటికే మద్యం తాగాడని ఆ మత్తులోనే టిఫిన్ తింటుండగా ఇలా జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మీ పాత ఫోన్‌ను అపరిచితులకు అమ్మేస్తున్నారా ??
సీరియళ్లు, సీనిమాలు చూసి ఏడుస్తున్నారా ?? అయితే మీకు..
ఇంతకీ దీపావళి ఏ రోజున జరుపుకోవాలి ??
‘దంగల్’కు రూ. 2 వేల కోట్లు వసూళ్లు.. ఫోగట్ ఫ్యామిలీకి దక్కిందెంతో తెలుసా ??
BSNL: దూకుడు పెంచిన బీఎస్‌ఎన్‌ఎల్.. అదిరిపోయే రీఛార్జ్ ఆఫర్