మందుకొట్టి స్కూలుకొచ్చిన హెడ్‌మాస్టర్.. అధికారులపైనే
సమాజానికి మంచి పౌరులను అందించడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతైనా ఉంటుంది. విద్యాబుద్ధులు, మంచి సంస్కారం నేర్పాల్సిన గురువులే గతితప్పి ప్రవర్తిస్తే విద్యార్ధులు ఏం నేర్చుకుంటారు.. మంచి పౌరులుగా ఎలా ఎదుగుతారు? గురువును దైవంగా భావించే దేవాలయం లాంటి పాఠశాలకు ఓ హెడ్ మాస్టర్ మత్తులో తూలుతూ వచ్చాడు.
అంతేకాదు, విచారణకు వచ్చిన ఉన్నతాధికారులకు మర్యాద చేయాల్సింది పోయి బూతులతో సుప్రభాతం పాడాడు. విజయనగరం జిల్లాలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెంటాడ మండలం కుంటినవలస హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు గత కొంతకాలంగా మద్యం సేవించి విధులకు హాజరవుతున్నట్లు విద్యాశాఖాధికారులకు ఫిర్యాదు అందింది. దీంతో డిప్యూటీ డీఈవో స్వయంగా విచారణ కోసం పాఠశాలకు వెళ్లారు. అప్పటికే మద్యం మత్తులో మునిగి ఉన్నాడు ఆ స్కూలు ప్రధానోపాధ్యాయుడు. అధికారిని చూసి నమస్కరించాల్సిందిపోయి, సహనం కోల్పోయాడు. విచారణకు సహకరించకుండా, ఆయన ముందే తోటి ఉపాధ్యాయులను, ఇతర సిబ్బందిని అసభ్య పదజాలంతో దూషించడం మొదలుపెట్టాడు. ఈ దృశ్యాలను అక్కడున్న వారు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించగా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఈ ఘటన విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఈ వీడియో ఆధారంగా సదరు ప్రధానోపాధ్యాయుడిపై కఠిన చర్యలకు అధికారులు సిద్ధమైనట్టు తెలుస్తోంది. హెడ్‌మాస్టర్ ప్రవర్తనపై స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మోహన్ లాల్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్.. మోదీ, పవన్ ప్రత్యేక అభినందనలు
Weather Update: తెలంగాణాలో మళ్ళీ జోరుగా కురుస్తున్న వర్షం
రజనీకాంత్‌కు గుడికట్టి పూజలు చేస్తున్న ఫ్యాన్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో