Drone: మందుల డెలివరీ కోసం.. 40 కి.మీ గాల్లో ప్రయాణించింది.. జస్ట్‌ 30 నిమిషాల్లో..! వీడియో

|

Feb 27, 2023 | 9:38 AM

ఉత్తరాఖండ్‌ రిషికేశ్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ -ఎయిమ్స్‌ నుంచి ఒక డ్రోన్ గాల్లోకి ఎగిరింది. గర్హ్వాల్ జిల్లా టెహ్రీలోని ఆరోగ్య కేంద్రానికి క్షయవ్యాధి

ఉత్తరాఖండ్‌ రిషికేశ్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ -ఎయిమ్స్‌ నుంచి ఒక డ్రోన్ గాల్లోకి ఎగిరింది. గర్హ్వాల్ జిల్లా టెహ్రీలోని ఆరోగ్య కేంద్రానికి క్షయవ్యాధి మందులను సరఫరా చేసింది. క్షయ రోగుల నమూనాలను అక్కడి నుంచి ఎయిమ్స్‌ హాస్పిటల్‌కు తీసుకొచ్చింది. సాధారణంగా ఈ ప్రాంతానికి ఘాట్‌ రోడ్డు మార్గంలో చేరేందుకు సుమారు రెండు గంటల సమయం పడుతుంది. అయితే 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆరోగ్య కేంద్రానికి కేవలం అర గంటలోనే డ్రోన్‌ చేరింది. ట్రయల్‌ రన్‌లో భాగంగా ఫిబ్రవరి 17న తొలిసారి డ్రోన్‌ ద్వారా మందులను సరఫరా చేశారు.కాగా, ఉత్తరాఖండ్‌లోని సుదూర ప్రాంతాలకు చెందిన రోగులకు డ్రోన్‌ ద్వారా మందులను సరఫరా చేయడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఎయిమ్స్‌ రిషికేశ్ ప్రాంతం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ మీనూ సింగ్ తెలిపారు. క్షయవ్యాధితో బాధపడుతున్న రోగులు డ్రోన్‌ ద్వారా మందులు పొందే వ్యవస్థను తాము రూపొందిస్తున్నట్లు చెప్పారు. దీని వల్ల చికిత్స కోసం ఆ రోగులు ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన అవసరం ఉండదని వెల్లడించారు. డ్రోన్‌ ద్వారా మందులను సరఫరా చేసేందుకు తాము చేపట్టిన తొలి ప్రయోగం చాలా విజయవంతమైందని హర్షం వ్యక్తం చేశారు.మరోవైపు పలు రాష్ట్రాల్లో కూడా డ్రోన్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి. జమ్ముకశ్మీర్‌లోని మంచు ప్రాంతాల్లో విధులు నిర్వహించే సైనికులకు కోవిడ్‌ వ్యాక్సిన్‌ బూస్టర్‌ డోసులను డ్రోన్‌ ద్వారా సరఫరా చేశారు. అలాగే మహారాష్ట్రలోని మారు మూల ప్రాంతాలకు వ్యాక్సిన్లను సరఫరా చేసేందుకు కూడా డ్రోన్లను వినియోగించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Rana: నీనవ్వు నన్ను మళ్ళీ నీ ప్రేమలో పడేలా చేస్తుంది.. రానా భార్య.

Fact Video: లేడీస్ బి అలెర్ట్..! పొంచి ఉన్న ప్రమాదం.. విషపూరితమైన మేకప్ గురించి విన్నారా..?

Taraka Ratna: తారకరత్నని చూడటానికి వచ్చిన మతిస్థిమితం లేని వ్యక్తి.. బాలయ్యకు ఏదో చెప్తూ..

Published on: Feb 27, 2023 09:38 AM