పనస తొనలు తిని డ్రైవ్ చేస్తే.. బుక్‌ అయినట్లే వీడియో

Updated on: Jul 30, 2025 | 4:34 PM

పట్టణ, నగర ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు సాయంత్రం, రాత్రి వేళల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తుంటారు. కొందరు మందుబాబులు పోలీసులు చేసే బ్రీత్‌ ఎనలైజర్‌‌ టెస్టులో దొరికిపోయి.. కేసుల పాలవుతుంటారు. అయితే.. ఒకవేళ మీరు డ్రైవింగ్‌కు ముందు లేదా డ్రైవింగ్ టైంలో పసన తొనలు తిన్నారంటే.. బ్రీత్‌ ఎనలైజర్‌ టెస్ట్‌‌లో మీకు కూడా పాజిటివ్ రావటం ఖాయం.

కేఎస్‌ఆర్‌టీసీకి చెందిన ముగ్గురు బస్సు డ్రైవర్లు పాండాలంలో ఈ వింత పరిస్థితిని ఎదుర్కొన్నారు. వారు తమ ఉదయపు షిఫ్ట్‌కు ముందు, రోజూ తప్పనిసరిగా చేసే బ్రీత్‌ఎనలైజర్ టెస్ట్‌కు వెళ్లారు. కాగా, అందులో ఒకరికి ఆల్కహాల్ పాజిటివ్‌గా తేలింది. తాను ఒక్క చుక్క కూడా మద్యం తీసుకోలేదని పట్టుబట్టినా, అధికారులు అతడిని నమ్మలేదు. మరి.. టెస్ట్‌లో పాజిటివ్ ఎందుకొచ్చిందని ఆరాతీసిన అధికారులు.. బ్రేక్ ఫాస్ట్‌కు బదులుగా 5 పనసతొనలు తిన్నట్లు చెప్పుకొచ్చాడు. కొట్టారకర నుండి వచ్చిన ఆర్టీసీ డ్రైవర్లలో ఒకరు తనకు అవి ఇచ్చారని వివరించాడు. కాసేపటికి పనస తొనలు తిన్న మరో ఇద్దరు డ్రైవర్లకూ బ్రీతింగ్ టెస్టులో అదే ఫలితం రావటంతో అధికారులు స్టన్ అయ్యారు. ముందు బ్రీత్‌ఎనలైజర్ మెషీన్‌లో లోపం ఉండవచ్చని భావించిన అధికారులు తర్వాత.. పసనపండే ఈ ఫలితానికి కారణమని నిర్ధారణకు వచ్చారు.ఇక.. ఈ డ్రైవర్లు తిన్న పనస పండు.. ‘తెన్‌వారిక’ రకానికి చెందినది. ఇది కేరళలో ఎక్కువగా దొరకుతుంది. తేనె మాదిరిగా తీయగా ఉండే ఈ పనస తొనలు.. బంగారు రంగులో ఉంటాయి. వాటిలోని అధిక గ్లూకోజ్, ఫ్రక్టోజ్ మూలంగా.. నిల్వ ఉన్న తొనల వల్ల కాస్త ఆల్కహాల్‌ ప్రభావం ఉంటుందని నిపుణులు తెలిపారు. ఈ రకం పనసతో వైన్ కూడా చేస్తారని వారు వివరించారు.

మరిన్ని వీడియోల కోసం :

కేవలం రూ.100కే ఇల్లు.. ఎక్కడో తెలుసా? వీడియో

వరుణ్ బర్త్ డే.. భార్య ఇచ్చిన గిఫ్ట్ చూసి ఒక్కసారిగా షాక్ వీడియో

ర్యాపిడో రైడ్‌లో సెల్ఫీ వీడియో రికార్డ్ చేసిన యువతి..! డ్రైవర్‌ చేసిన పనితో వీడియో

 

Published on: Jul 30, 2025 12:20 PM