కారు డ్రైవర్‌ను మస్కా కొట్టిన గూగుల్ మ్యాప్స్.. ఫ్లైఓవర్‌ పై నుంచి దూసుకెళ్లిన కారు.. కట్‌ చేస్తే

Updated on: Jun 18, 2025 | 5:42 PM

ప్రస్తుతం ప్రపంచమంతా గూగుల్‌ మీదే ఆధారపడి పనిచేస్తుంది. రోజుకు ఏదో ఒక సందర్భంలో గూగుల్‌ని ఆశ్రయిస్తుంటారు. గూగుల్ మ్యాప్‌తో ఎంతదూరమైన, ఎలాంటి తెలియని అడ్రస్ అయినా కూడా గుగుల్ మ్యాప్‌ను అడిగితే దారిని చూపిస్తుంది. అయితే కొన్నిసార్లు ఈ గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకున్న వాళ్లు ఊహించని చిక్కుల్లో పడిన సందర్భాలు కూడా తరచూ వార్తల్లో చూస్తుంటాం.

అలాగే, తాజాగా గూగుల్ మ్యాప్‌ను నమ్ముకున్న ఓ డ్రైవర్‌కు చుక్కలు చూపించింది. సాధారణంగా ఏదైనా తెలియ‌ని ప్రదేశాలకు వెళ్లేట‌ప్పుడు గూగుల్ మ్యాప్స్ స‌హాయం తీసుకుంటుంటారు. అది రైటంటే రైటు.. లెఫ్టంటే లెఫ్టు స్టీరింగ్ తిప్పుతూ వెళ్తుంటారు. సరిగ్గా అలాంటి పనినే చేశాడు యూపీకి చెందిన ఒక డ్రైవర్‌. యూపీలోని మహారాజ్‌గుంజ్‌లో గమ్యస్థానానికి వెళ్లడానికి.. గూగుల్ మ్యాప్స్‌లో లొకేషన్ పెట్టుకున్న ఓ డ్రైవర్‌కు ఊహించని సీన్‌ ఎదురైంది. గూగుల్‌ మ్యాప్స్‌ ఆధారంగా అతడు అది చూపించే డైరెక్షన్స్ చూస్తూ.. నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్‌పైకి వెళ్ళాడు. ముందుకు వెళ్లేందుకు రహదారి లేదని గుర్తించేలోపే ఒక్కసారి కారు ప్రమాదవశాత్తు కిందపడిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటన జూన్ 8 ఆదివారం జరిగినట్లు తెలుస్తోంది. లక్నో నంబర్ ప్లేట్ ఉన్న కారు గోరఖ్‌పూర్ నుండి సోనౌలి సరిహద్దుకు ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రయాణికులు నావిగేషన్ కోసం గూగుల్ మ్యాప్స్‌పై ఆధారపడ్డారని తెలిసింది. యాప్ సూచించిన మార్గాన్ని అనుసరిస్తుండగా, వారు ఫరెండా పోలీస్ స్టేషన్ ప్రాంతానికి సమీపంలో గోరఖ్‌పూర్-సోనౌలి హైవేపై నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్‌ ఎక్కారు. అసంపూర్తిగా ఉన్న ఆ ఫ్లైఓవర్‌ పైనుంచి కారు అమాంతంగా కిందకు గొయ్యిలోకి పడిపోయింది. అదృష్టవశాత్తూ కారులో ఉన్న వారంతా సురక్షితంగా బయటపడటంతో ప్రాణాపాయం తప్పింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తనకు అన్నం పెట్టి ఆదరించిన వ్యక్తి చనిపోతే కొండముచ్చు ఏం చేసిందో తెలుసా

మందేసి ఫుట్‌పాత్‌పై నిద్రపోతున్న వ్యక్తి.. దగ్గరకొచ్చి వాసన చూసిన ఆడసింహం

రూ.500 నోటుపై స్టార్‌ గుర్తు.. ఇది నకిలీదా..ఆర్బీఐ ఏం చెబుతోంది?

బొట్టు పెడుతుండగా వరుడికి వణుకుడు రోగం.. వధువు ఏం చేసిందంటే ?