అత్త కాళ్లపై పడిన అల్లుడు.. ఆమె ఛీకొడుతున్నా కాళ్లు వదల్లేదు

Updated on: Dec 21, 2025 | 4:44 PM

భార్య వేధింపులు భరించలేక పుట్టింటికి వెళ్ళిన సంఘటన అలీగఢ్‌లో చర్చనీయాంశంగా మారింది. పోలీస్ కౌన్సెలింగ్ సందర్భంగా భర్త అత్త కాళ్లపై పడి, భార్యను తిరిగి పంపమని వేడుకున్నాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గృహ హింస ఆరోపణలతో భార్య ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు మరోసారి కౌన్సెలింగ్‌కు పిలిచారు.

భర్త వేధింపులు భరించలేక భార్య పుట్టింటికి వెళ్లింది. ఆమె ఫిర్యాదుతో భార్యాభర్తలను కౌన్సెలింగ్‌కు పోలీసులు పిలిపించారు. ఈ సందర్భంగా ఆ వ్యక్తి అత్త కాళ్లపై పడ్డాడు. భార్యను తన ఇంటికి పంపాలని వేడుకున్నాడు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో ఈ సంఘటన జరిగింది. మధుర జిల్లాకు చెందిన వ్యక్తికి గొండా జిల్లాలోని గ్రామానికి చెందిన మహిళతో తొమ్మిదేళ్ల కిందట వివాహమైంది. వారికి ముగ్గురు పిల్లల్లున్నారు. ఆ వ్యక్తి భార్యను వేధిస్తుండటంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే భర్త దాడి, మానసిక వేధింపులపై గతంలో మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేసింది. డిసెంబర్‌ 17న కౌన్సెలింగ్ కోసం ఇరు వర్గాలను పోలీసులు పిలిచారు. భార్యతో కలిసి జీవిస్తానని పోలీస్‌ అధికారిణికి అతడు హామీ ఇచ్చాడు. మరోసారి కౌన్సిలింగ్‌కు రావాలని పోలీసులు వారికి చెప్పారు. మరోవైపు కౌన్సెలింగ్‌ తర్వాత పోలీస్‌ స్టేషన్‌ బయట భార్యను తన ఇంటికి పంపాలని అత్తను ఆ వ్యక్తి వేడుకున్నాడు. ఆమె కాళ్లపై పడి ప్రాథేయపడ్డాడు. అత్త ఒప్పుకోకపోవడంతో ఆమె కాళ్లు విడిచిపెట్టలేదు. చివరకు పోలీసుల జోక్యంతో అత్త కాళ్లు విడిచిపెట్టాడు. అయితే అత్తమామలే తన భార్యను రెచ్చగొడుతున్నారని అతడు ఆరోపించాడు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నెరవేరిన ఎమ్మెల్యే శపథం.. నాలుగేళ్ల తర్వాత ఏం చేశాడంటే

అబ్బా.. ఏం వాడకమయ్యా.. రైతన్న తెలివికి సలాం కొట్టాల్సిందే!

గర్భిణీ శవాన్ని ఊర్లోకి రాకుండా అడ్డుకున్న గ్రామ పెద్దలు.. ఎందుకంటే

అరుదైన దృశ్యం.. సౌదీ ఎడారిలో మంచు.. ప్రతి ఒక్కరు తప్పక చూడాల్సిన వీడియో

అండమాన్‌ నికోబార్‌ దీవులకు.. పేర్లు పెట్టే ఛాన్స్‌