లక్ అంటే ఇదీ.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన జాలరి

Updated on: Oct 15, 2025 | 7:08 PM

అదృష్టం కలిసొచ్చి.. రాత్రికి రాత్రి లక్షాధికారులైన వారిని మీరు చూసుంటారు. గొప్పగా బతికి పరిస్థితి తలకిందులై బిచ్చగాళ్లుగా మారిన వారి గురించీ వినే ఉంటారు. అదృష్టం ఒక్కోసారి పడిశం పట్టినట్లు పడుతుందని పెద్దలు చెప్పిన మాట.. ఈ మత్స్యకారుడి విషయంలో నిజమైంది. సముద్రంలో వేటకు వెళ్లిన అతని వలలో అత్యంత అరుదైన చేపలు పడటంతో.. మనోడు రాత్రికి రాత్రి కోటీశ్వరుడై పోయాడు.

ఆరోగ్యానికి మేలు చేస్తాయనే పేరున్న రూ. కోటి విలువైన 90 భోలా చేపలు అతడి వలలో పడటంతో అతడి దశ తిరిగిపోయింది. ఒడిశా -పశ్చిమ బెంగాల్ సరిహద్దు వెంబడి దిఘా సమీపంలోని బంగాళాఖాతం ముఖద్వారం వద్ద చేపలు పడుతుండగా ఒక మత్స్యకారుడు 90 భారీ తెలియా భోలా చేపలను పట్టుకున్నాడు. అవి ఒక్కో చేప 30 నుండి 35 కేజీల బరువు ఉండగా, వేలంలో అవన్నీ కలిపి.. దాదాపు రూ.1 కోటి ధర పలికాయి. దిఘా చేపల మార్కెట్ వద్ద ఒకేసారి పెద్ద మొత్తంలో లభించిన ఈ అరుదైన చేపలను చూసేందుకు స్థానికులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు.కోల్‌కతాకు చెందిన ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ మొత్తం 90 చేపలను కొనుగోలు చేసింది. వాటిలోని అధిక ఔషధ, వాణిజ్య విలువల కారణంగా ఈ చేపలను కొనుగోలు చేసిందని వర్గాలు తెలిపాయి. ఈ చేప నూనె, ఇతర ఉత్పత్తులు పలు రోగాల నివారణలో బాగా పనిచేస్తాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బిగ్‌బాస్‌లోకి దివ్వల మాధురి.. అందుకే భర్తతో విడిపోయా

చుక్కలు చూపించనున్న చలి20 డిగ్రీలకు పడిపోనున్న టెంపరేచర్

అర్ధరాత్రి దొంగల బీభత్సంఆ ఇళ్లే టార్గెట్‌

తండ్రి ఆశయం కోసం IPS సాధించిన ఫారిన్ విద్యార్థిని

మహావతార్‌లాగే.. కురుక్షేత్ర మూవీ OTTలో తప్పక చూడాల్సిందే