బస్సు డ్రైవర్‌ ఓవరాక్షన్‌.. సీఎం వార్నింగ్‌

Updated on: May 27, 2023 | 12:45 PM

దేశరాజధాని ఢిల్లీలో ప్రభుత్వం మహిళలకోసం ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించిన విషయం తెలిసిందే. అయితే ఇది ఎంతవరకూ అమలవుతోంది అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని బస్సుల్లో, మెట్రోల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది కేజ్రీవాల్ సర్కార్‌.

దేశరాజధాని ఢిల్లీలో ప్రభుత్వం మహిళలకోసం ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించిన విషయం తెలిసిందే. అయితే ఇది ఎంతవరకూ అమలవుతోంది అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని బస్సుల్లో, మెట్రోల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది కేజ్రీవాల్ సర్కార్‌. 2019లో రక్షా బంధన్ సందర్భంగా మహిళలకు ఈ కానుకను ఇచ్చింది. కానీ, ఎంతో గొప్పగా ఈ ఫ్రీ జర్నీ పథకాన్ని ప్రారంభించగా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి వేరేగా ఉంది. ఢిల్లీలోని ఓ బస్‌స్టాప్‌లో ముగ్గురు మహిళలు బస్సు కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతలో బస్సు రానే వచ్చింది. కానీ బస్సు అక్కడ ఆగలేదు. బస్సులోని ఓ ప్రయాణికుడిని దించేందుకు బస్సును నెమ్మదిగా పోనిచ్చిన ఆ డ్రైవర్.. అతను దిగగానే బస్సును వేగంగా పోనిచ్చాడు. ఆ బస్సు ఎక్కేందుకు మహిళలు పరుగులు పెట్టినా డ్రైవర్‌ చూసి కూడా ఆపకుండా వెళ్లిపోయాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట పోస్ట్ చేస్తూ .. ఢిల్లీలో మహిళల ఇబ్బందులు అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు. దాంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఈ వ్యవహారం కేజ్రీవాల్ సర్కారు దృష్టికి వెళ్లడంతో ఆ డ్రైవర్ ను గుర్తించి వెంటనే విధుల నుండి సస్పెండ్ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నడిరోడ్డుపైనే యువతి, యువకుడు.. కట్‌చేస్తే కేసు నమోదు.. ఎందుకంటే ??

మ‌హిళ‌ల‌కు వాడిపడేసిన కండోమ్ పార్సిళ్లు !! ఎక్క‌డంటే ??

మొసలి రక్తాన్ని కాఫీలా తాగేస్తున్నాడు !! ఎందుకో తెలిస్తే షాకే

Sarath Babu: ఆస్తులెవరికి ?? భార్యలకా ?? తోబుట్టువులకా ??

Men Too: మెన్ టూ రివ్యూ.. మరీ సినిమా హిట్టా..? ఫట్టా..? తెలియాలి అంటే వీడియో చేసేయండి మరి

 

Published on: May 27, 2023 12:44 PM
Loading...
Unable to load recommendations.
Follow Us