కూలీని వరించిన అదృష్టం.. గనిలో దొరికిన రూ.40 లక్షల విలువైన వజ్రం

Updated on: Jul 01, 2026 | 5:31 PM

మధ్యప్రదేశ్‌లోని పన్నా వజ్రాల గనిలో ఓ గిరిజన కూలీ అదృష్టం ఒక్కసారిగా మారిపోయింది. మట్టిని జల్లిస్తుండగా అతడికి 11.19 క్యారెట్ల అరుదైన తెల్ల వజ్రం లభించింది. దీనికి బహిరంగ వేలంలో రూ.40 లక్షలకు పైగా ధర పలికే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. లభించే డబ్బుతో అప్పులు తీర్చి, ఇల్లు, వ్యవసాయ భూమి కొనుగోలు చేస్తానని కూలీ తెలిపాడు.

అదృష్టం ఎప్పుడు, ఏ రూపంలో తలుపు తడుతుందో ఎవరూ ఊహించలేరు. రోజూ మట్టిని తవ్వుతూ, రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితిలో ఉన్న ఓ పేద కూలీని రాత్రికి రాత్రే లక్షల రూపాయల సంపద వరించింది. మధ్యప్రదేశ్‌లోని ప్రసిద్ధ పన్నా వజ్రాల గనిలో ఒక కూలీకి ఏకంగా 11.19 క్యారెట్ల అరుదైన తెల్ల వజ్రం లభించింది. రాకేశ్ గోండ్ అనే గిరిజన యువకుడు కూలీగా జీవనం సాగిస్తున్నాడు. అహిర్‌గువా ప్రాంతంలో చిన్న వజ్రాల గని ముక్కను లీజుకు తీసుకున్న అతడు, ఆదివారం సాధారణ పనిముట్లతో మట్టిని జల్లిస్తుండగా మెరుస్తూ ఈ వజ్రం దొరికింది. రాకేశ్, వెంటనే దానిని ప్రభుత్వ వజ్రాల కార్యాలయంలో అప్పగించాడు. నిపుణులు దీని నాణ్యతను పరిశీలించి, రాబోయే బహిరంగ వేలంలో దీనికి రూ.40 లక్షలకు పైగా ధర పలికే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ పన్నులు మినహాయించి మిగిలిన సొమ్ము అంతా రాకేశ్ కుటుంబానికి అందజేయనున్నారు. ఈ భారీ మొత్తంతో తనకున్న అప్పులన్నీ తీర్చేసి, సొంతంగా వ్యవసాయ భూమి, ఇల్లు కొనుగోలు చేస్తానని రాకేశ్ ఆనందంగా చెప్తున్నాడు. అలాగే తన పిల్లలకు మంచి చదువు చెప్పించడమే తన మొదటి ప్రాధాన్యమన్నాడు. పన్నా వజ్రాల గనుల్లో ఇటీవల వరుసగా ఇలాంటి వజ్రాలు లభిస్తుండడం విశేషం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

స్టోర్ రూంలో వింత శబ్దాలు వెళ్లి చూసిన ఇంటి యజమాని గుండె గుభేల్‌!

Bullet Train: హైదరాబాద్ – బెంగళూరు బుల్లెట్ ట్రైన్‌ ప్రాజెక్ట్‌ పనులు షురూ!

Maharashtra: గుండెను పిండేసే ఘటన పొలం దున్నేందుకు కాడెద్దుగా మారిన యువకుడు

Follow Us