ఆస్కార్ అవార్డు ఇస్తేగిస్తే దీనికే ఇవ్వాలి…పెంపుడు శునకం యాక్టింగ్ స్కిల్స్ చూడండి…Viral Video

|

Apr 19, 2021 | 8:31 PM

Viral Video: పిల్లలే కాదు...పెంపుడు శునకాలకు కూడా స్నానం చేయించాలంటే తల ప్రాణం తోకకు వస్తుంటుంది. స్నానం నుంచి ఎక్కేప్ అయ్యేందుకు నేల మీద దొర్లడం వంటి ఫీట్స్ చేస్తుంటాయి.

ఆస్కార్ అవార్డు ఇస్తేగిస్తే దీనికే ఇవ్వాలి...పెంపుడు శునకం యాక్టింగ్ స్కిల్స్ చూడండి...Viral Video
Acting Dog
Follow us on

స్నానం చేసుకోవడం ఇష్టంలేని పిల్లలు… వద్దంటే వద్దంటూ మారం చేయడం చూస్తూనే ఉంటాం.  ఉదయాన్నే స్నానం నుంచి ఎస్కేప్ అయ్యేందుకు కొందరు చిన్నారులు చేయని ప్రయత్నమంటూ ఉండదు. పిల్లలకే కాదు…పెంపుడు శునకాలకు కూడా స్నానం చేయించాలంటే తల ప్రాణం తోకకు వస్తుంటుంది.  స్నానం నుంచి ఎక్కేప్ అయ్యేందుకు నేల మీద దొర్లడం వంటి ఫీట్స్ చేస్తుంటాయి. ఇక్కడ ఓ క్యూట్ శునకం వీరలెవల్ యాక్టింగ్‌తో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. యజమాని తనకు స్నానం చేయించేందుకు రెడీ అవుతున్న విషయాన్ని పసిగట్టేసిన ఆ శునకం…వెల్లకి పడుకుని చనిపోయినట్లు కొన్ని నిమిషాల పాటు యాక్టింగ్ చేసింది. యజమాని దాన్ని చేత్తో తట్టి లేపేందుకు చేసిన ప్రయత్నాలూ నెరవేరలేదు. చివరకు యజమాని గట్టిగా ప్రయత్నించడంతో అది యాక్టింగ్ మోడ్ లో నుంచి బయటికొచ్చింది.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్స్ ఆ శునకం యాక్టింగ్ స్కిల్స్‌ను తెగ మెచ్చుకుంటున్నారు. నటనకు ఆస్కార్ అవార్డు ఇస్తేగిస్తే దీనికే ఇవ్వాలంటూ రెకమండ్ చేస్తున్నారు. కొందరు మాత్రం ఈ డాగ్ చాలా స్మార్ట్, ఇంటెలిజెంట్ అంటూ కితాబిస్తున్నారు.